ఆతృతా, రణగొణధ్వనులమధ్య శాంతంగా స్థిరంగా నడుచుకో; నిశ్శబ్దంలో ఎంత  ప్రశాంతత ఉందో గుర్తుంచుకో.  సాధ్యమైనంతవరకు, ఎవరికీ తలవంచకుండానే, మంచి అనుబంధాలు కలిగి ఉండు; నువ్వు సత్యాన్ని చెప్పేటప్పుడు స్పష్టంగా,  నెమ్మదిగా చెప్పు; అలాగే, ఇతరులు ఏది చెప్పినా శ్రద్ధగా విను, వాళ్లు ఎంత మొద్దులూ, మూర్ఖులూ ఐనా; ఎందుకంటే, ప్రతి వ్యక్తికీ ఒక కథ ఉంటుంది.

గట్టిగా అరిచి, దురుసుగా మాటాడే వాళ్ళని తప్పించుకు తిరుగు; వాళ్ళు నీ మనస్సుకి క్షోభ కలిగిస్తారు. ఇతరులతో అస్తమానం నిన్ను నువ్వు పోల్చుకుంటుంటే, నువ్వు జీవితం పట్ల నిరాశ పెంచుకోవడమో లేక అహంభావిగా మారడమో జరిగే అవకాశం ఉంది; ఎప్పుడూ నీకంటే తక్కువ వాళ్ళూ, ఎక్కువ వాళ్ళూ ఉంటూనే ఉంటారు;  నీ విజయాలను ఆస్వాదించడంతో బాటు, నీ ప్రణాళికలను కూడా ఆనందించు.

నువ్వు చేసే వృత్తి ఎంత చిన్నదైనా, దానిపట్ల సంతృప్తి కలిగి ఉండు.  అదృష్టాన్ని మార్చే కాలం చేసే అనేక లీలల్లో, అదే నీకు విలువైన ఆస్థిగా నిలబడుతుంది. నీ వ్యాపార విషయాల్లో తగినంత జాగ్రత్త వహించు; ఎందుకంటే ప్రపంచం మోసగాళ్ళ మయం. అంత మాత్రం చేత నువ్వు విలువైన వస్తువుల్ని గుర్తించడంలో గుడ్డివాడివి కాకు;  చాలా మంది మనుషులు ఉదాత్తమైన ఆదర్శాలకోసం పాటుపడుతుంటారు; నీ చుట్టూ జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగిన ధీరులున్నారు.

నువ్వు నువ్వుగా జీవించు. ముఖ్యంగా ప్రేమ నటించవద్దు. అలాగని ప్రేమ పట్ల నిరాశకూడా వద్దు; ఎందుకంటే, శుష్కించిపోయి, జీవితంపట్ల విరక్తి కలిగే సందర్భాల్లో అదొక్కటే పచ్చగడ్డిలా శాశ్వతంగా ఉంటుంది.

వృద్ధులు చెప్పిన మంచి సలహాలు విను;  వయసు చేసే పనులను వినమ్రంగా స్వీకరించు; అనుకోని దుర్ఘటనలు సంభవిస్తే నిన్ను నువ్వు రక్షించుకుందికి, మానసిక ధైర్యాన్ని అలవరచుకో. అలాగని, ఊహించుకుంటూ బాధపడకు. చాలా  భయాలు ఒంటరితనం వల్లా,  అలసట వల్లా కలుగుతుంటాయి. పరిపూర్ణమైన క్రమశిక్షణకు మించి, నీ పట్ల నువ్వు మెత్తగా ప్రవర్తించు.

నువ్వు ఈ విశ్వ శిశువువి, పరీవ్యాప్తమైన చెట్లూ, చుక్కలకంటే తక్కువేమీ కాదు; నీకు ఇక్కడ జీవించడానికి హక్కు ఉంది. నీకు అది అవగతం అవుతున్నా, లేకపోయినా, ఈ విశ్వం నిస్సందేహంగా తనను తాను ప్రకటించుకుంటూనే ఉంది

కనుక దేముడి విషయంలో ప్రశాంతంగా ఉండు. అతని గురించి నీ ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ, నీ ఆశలూ కష్టాలూ ఏవయినప్పటికీ, సందడిచేసే ఈ జీవితపు గందరగోళంలో,  నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఎంతగా కపటం నిండినా, చేసిన గొడ్డు చాకిరీయే చేస్తున్నా, కలలు తెగిపడినా, ఈ ప్రపంచం ఇంకా సుందరంగానే ఉంటుంది.

ఎప్పుడూ ఉల్లాసంగా ఉండు

హాయిగా ఉండడానికి ప్రయత్నించు.

.

మాక్స్ ఎర్మాన్

September 26, 1872 – September 9, 1945

అమెరికను

.

Max Ehrmann

.

Desiderata

 .

Go placidly amid the noise and haste, and remember what peace there may be in silence.

As far as possible without surrender be on good terms with all persons. Speak your truth quietly and clearly; and listen to others, even the dull and ignorant; they too have their story.

Avoid loud and aggressive persons, they are vexations to the spirit. If you compare yourself with others, you may become vain and bitter; for always there will be greater and lesser persons than yourself. Enjoy your achievements as well as your plans.

Keep interested in your career, however humble; it is a real possession in the changing fortunes of time. Exercise caution in your business affairs; for the world is full of trickery. But let this not blind you to what virtue there is; many persons strive for high ideals; and everywhere life is full of heroism.

Be yourself. Especially, do not feign affection. Neither be cynical about love; for in the face of all aridity and disenchantment it is as perennial as the grass.

Take kindly the counsel of the years, gracefully surrendering the things of youth. Nurture strength of spirit to shield you in sudden misfortune. But do not distress yourself with imaginings. Many fears are born of fatigue and loneliness. Beyond a wholesome discipline, be gentle with yourself.

You are a child of the universe, no less than the trees and the stars; you have a right to be here. And whether or not it is clear to you, no doubt the universe is unfolding as it should.

Therefore be at peace with God, whatever you conceive Him to be, and whatever your labours and aspirations, in the noisy confusion of life keep peace with your soul.

With all its sham, drudgery and broken dreams, it is still a beautiful world.

Be cheerful.

Strive to be happy.

.

Max Ehrmann

September 26, 1872 – September 9, 1945

American

 

వ్రాసినది: NS Murty | నవంబర్ 27, 2014

స్వరకర్త… W H ఆడెన్, అమెరికను కవి

మిగతావాళ్ళందరూ అనువదిస్తారు: ఒక చిత్రకారుడు
దృశ్యమానప్రపంచాన్ని అంగీకరించినా, తృణీకరించినా;
తనజీవితంలోకితొంగిచూచి, మధించి వెలికి తీస్తాడు ప్రతిబింబాలని
ఒక కవి …వాటితో మమేకమవడానికో, విభేదించడానికో;
జీవితం నుండి కళ … అతి కష్టమైన అనుకరణ
మధ్యనున్న ఖాళీలను పూరించడానికి మనమీద ఆధారపడుతూ;
కేవలం నీ స్వరాలొక్కటే అచ్చమైన సహజ సృష్టి,
నీ పాట ఒక్కటే అపురూపమైన కానుక;
ఓ ఆనందమా! నీ సన్నిధిని మాకు కలుగజెయ్యి,
సాష్టాంగపడేలా పులకరింతలు కలుగజెయ్యి,
మా మౌనాలపై, సందేహాలపై దాడిచెయ్యి;
ఓ అజ్ఞాత గీతికా! నువ్వు, నువ్వొక్కతెవే
ఈ మా ఉనికిని తప్పు పట్టకుండా ఉన్నది;
నీ క్షమని కాదంబరిలా మాకు అనుగ్రహించు.
.
W H ఆడెన్
21 ఫిబ్రవరి – 1907 – 29 సెప్టెంబరు 1973
అమెరికను కవి.

.

The Composer

.

All the others translate: the painter sketches

A visible world to love or reject;

Rummaging into his living, the poet fetches

The images out that hurt and connect.

From Life to Art by painstaking adaption

Relying on us to cover the rift;

Only your notes are pure contraption,

Only your song is an absolute gift.

 

Pour out your presence, O delight, cascading

The falls of the knee and the weirs of the spine,

Our climate of silence and doubt invading;

You, alone, alone, O imaginary song,

Are unable to say an existence is wrong,

And pour out your forgiveness like a wine.

.

W H Auden

21 February 1907 – 29 September 1973

American Poet

సందేహించనక్కరలేదు, వాళ్ళు త్వరలోనే కోలుకుంటారు

ఒత్తిడీ, దిగ్భ్రాంతీ వాళ్ళు నత్తిగా, అర్థంలేకుండా మాటాడేట్టు చేశాయి.

“వాళ్ళకి మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళాలనిపిస్తుం” దనుకొండి సందేహం లేదు 

గాట్లుపడ్డమొహాలతో, నడవడం నేర్చుకుంటున్న ఈ సైనికులకి.

వాళ్ళు త్వరలోనే తమ నిద్రలేని రాత్రుళ్ళగురించి మరిచిపోతారు;

చనిపోయిన మిత్రుల ఆత్మలకు భయంతో మోకరిల్లడం కూడా,

హత్యలతో రక్తమోడుతున్న వాళ్ళ కలలూ, వాళ్ళ గర్వాన్ని సమూలంగా

హరించిన మాహా యుద్ధం గురించి ఇప్పుడు మహా గొప్పగా చెప్పుకుంటారు.

విచారంతోనూ, ఆనందంగానూ యుద్ధానికి వెళ్ళేరు పురుషులు

నిన్ను ద్వేషించే కళ్ళతో, దిక్కులేక, పిచ్చెక్కినట్టున్నారు పిల్లలు.

.

సీ ఫ్రై ససూన్

(8 September 1886 – 1 September 1967)

ఇంగ్లీషు కవి.

Siegfried Sassoon

Siegfried Sassoon
Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm

.

Survivors

 .

No doubt they’ll soon get well; the shock and strain

Have caused their stammering, disconnected talk.

Of course they’re ‘longing to go out again,’

These boys with old, scared faces, learning to walk.

They’ll soon forget their haunted nights; their cowed

Subjection to the ghosts of friends who died,

Their dreams that drip with murder; and they’ll be proud

Of glorious war that shatter’d all their pride…

Men who went out to battle, grim and glad;

Children, with eyes that hate you, broken and mad.

.

Siegfried Sassoon.

(8 September 1886 – 1 September 1967)

English Poet

 

వ్రాసినది: NS Murty | నవంబర్ 25, 2014

శరణు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

తలపండిన నా  వయసు ఓటమిలో
శృతితప్పుతున్న నా నాడి సవ్వడులలో
బిగిసిన నా పిడికిలి సందుల్లోంచి జారుతూ
ఇసుకరేణువులైపోయిన నా ఆశలతో
నా నేరాల బానిసత్వంలో ఇంకా
నేను పాడగలిగితే, నేను స్వేచ్ఛాజివినే!

ఎందుకంటే, నా పాటతో, నా మనసుకి
ఒక ఆశ్రయాన్ని కల్పించగలను…
నగిషీమాటల మందిరం నిర్మించగలను …
అదే నాకు క్షణికమైన కైవల్యం.
.
సారా టీజ్డేల్

August 8, 1884 – January 29, 1933

అమెరికను కవయిత్రి

 

 

Refuge

.

From my spirit’s gray defeat
From my pulse’s flagging beat,
From my hopes that turned to sand,
Sifting through my close-clenched hand,
from my own fault’s slavery,
If I can sing, I still am free.

For with my singing, I can make
a refuge for my spirit’s sake,
A house of shining words, to be
my fragile immortality.

.

Sara Teasdale

August 8, 1884 – January 29, 1933

American Poetess

 

వ్రాసినది: NS Murty | నవంబర్ 24, 2014

XXXI ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి

భవిష్యత్తు ఎన్నడూ మాటాడలేదు;
మూగవాళ్ళలా కనీసం ఎన్నడూ
చేష్టలతోనో, సంజ్ఞలతోనో నిగూఢమైన
భావి విషయాలను తెలియపరచనూలేదు.    
కానీ, సరియైన సమయం వచ్చినపుడుమాత్రం
వాటిని అక్షరాలా ఆచరణలో చూపిస్తుంది…వాటిని       
తప్పించుకుందికీ, ప్రతిక్షేపించడానికీ
చెయ్యగల అన్ని అవకాశాలని ముందే వమ్ముచేస్తూ.  
సంపదలైనా, సర్వనాశనమైనా
రెంటిపట్లా దానికి ఒకే అనాశక్తత;
విధి దానికి ఆదేశించిన శాసనాన్ని
తు.చ. ఆచరించడమే దాని కర్తవ్యం.
.
ఎమిలీ డికిన్సన్
December 10, 1830 – May 15, 1886
అమెరికను కవయిత్రి.

 

XXXI   
.
The Future never spoke,
Nor will he, like the Dumb,
Reveal by sign or syllable
Of his profound To-come.
But when the news be ripe,
Presents it in the Act–
Forestalling preparation
Escape or substitute.
Indifferent to him
The Dower as the Doom,
His office but to execute
Fate’s Telegram to him.
.
Emily Dickinson

December 10, 1830 – May 15, 1886

American Poetess
(From: The Single Hound, Poems of a Lifetime)
http://digital.library.upenn.edu/women/dickinson/hound/hound.htmlXXXI

ఆమె వేకువ తుషారంలా హరించిపోయింది
సూర్యుడు ఇంకా పైకి ఎగబ్రాకక ముందే;
ఆమె జీవించింది ఎంత స్వల్పసమయమంటే,
నిట్టూర్పు అంటే అర్థం ఏమిటో ఆమెకి తెలీదు.

గులాబి చుట్టూ దాని సువాసన వ్యాపించినట్టు
ఆమె చుట్టూ ప్రేమ తేలియాడింది.
గుట్టుచప్పుడుకాకుండా, మృత్యువు సమీపిస్తోందన్న
స్పృహ, భయంలేకుండా,ఆమె పెరిగింది.

ప్రేమే ఆమె సంరక్షకురాలిక్కడ
కానీ, ప్రేమే మృత్యువుముందు తలవాల్చింది
ప్రేమకి దయ కలిగినప్పుడు భయం దేనికి,
కానీ, మృత్యువు అంత దయతో ఉంటుందా?
.
హార్ట్ లీ కోలరిడ్జ్ ‘

19 September 1796 – 6 January 1849
ఇంగ్లీషు కవి

Early Death

.

She pass’d away like morning dew

Before the sun was high;

So brief her time, she scarcely knew

The meaning of a sigh.

As round the rose its soft perfume,

Sweet love around her floated;

Admired she grew—while mortal doom

Crept on, unfear’d, unnoted.

Love was her guardian Angel here,

But Love to Death resign’d her;

Tho’ Love was kind, why should we fear

But holy Death is kinder?

.

Hartley Coleridge.

19 September 1796 – 6 January 1849

English Poet

1796–1849

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Ed: Arthur Quiller-Couch, 1919.

వ్రాసినది: NS Murty | నవంబర్ 21, 2014

డబ్బు… ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి

మూడునెలలకొకసారి, కదూ, డబ్బు నన్ను దెబ్బలాడుతుంటుంది
“ఎందుకిక్కడ నన్ను ఇలా వృధాగా పడి ఉండమంటావ్?
నువ్వు ఇంతవరకు ఎరుగని వస్తువుల్నీ, సుఖాన్నీ ఇవ్వగలను.
మించిపోయిందిలేదు ఇప్పుడైనా కొన్ని చెక్కులు సంతకం చెయ్యి.”

నేను మిగతావాళ్ళవంక చూస్తాను, వాళ్ళడబ్బుల్తో ఏమిటిచేస్తారా అని.
మేడమీద అయితే ఖచ్చితంగా డబ్బు దాచుకోరు.
బహుశా ఈపాటికి, కారూ, పెళ్ళామూ, రెండో ఇల్లు ఉండి ఉంటుందేమో
జీవితంలో డబ్బు పాత్ర చాలానే ఉందని ఒప్పుకోవాల్సిందే.

- నిజానికి, తరిచిచూస్తే, వాళ్ళలో ఒక సామాన్యధర్మం కనిపిస్తుంది:
నువ్వు పదవీ విరమణ చేసేదాకా యవ్వనాన్ని ఆపలేవు కదా,
నువ్వు బాంకులో ఎంత జీతం దాచుకున్నా*, నువ్వు దాచినడబ్బు
చివరకి మరణశయ్యమీది క్షవరానికి **చాలదు.

నేను కాసుల సంగీతం వింటుంటాను.  అదెలా ఉంటుందంటే
ఫ్రెంచి కిటికీలోంచి ఒక మహా పట్టణాన్ని చూసినట్టుంటుంది,
సూర్యాస్తమయవేళలో… అక్కడి మురికివాడలూ, కాలువలూ,
పిచ్చిగా అలంకరించిన చర్చిలూ… ఓహ్,  చాలా బాధాకరమైన దృశ్యం.
.
ఫిలిప్ లార్కిన్

9 August 1922 – 2 December 1985

ఇంగ్లీషు కవి

  (Note: (For the terms in the original Poem)

  *Bank Your Screw: (English Slang) To save in the Bank

 **Shave : The fee of Mortician to make the dead body look good in the coffin)

 .

Money

.

Quarterly, is it, money reproaches me:

‘Why do you let me lie here wastefully?

I am all you never had of goods and sex.

You could get them still by writing a few cheques.’

 

So I look at others, what they do with theirs:

They certainly don’t keep it upstairs.

By now they’ve a second house and car and wife:

Clearly money has something to do with life

 

- In fact, they’ve a lot in common, if you enquire:

You can’t put off being young until you retire,

And however you bank your screw*, the money you save

Won’t in the end buy you more than a shave.**

 

I listen to money singing. It’s like looking down

From long French windows at a provincial town,

The slums, the canal, the churches ornate and mad

In the evening sun. It is intensely sad.

.

Philip Larkin

9 August 1922 – 2 December 1985

English Poet

 

 

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/search/label/Poet%3A%20Philip%20Larkin

వ్రాసినది: NS Murty | నవంబర్ 20, 2014

పేరు… అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి

నా పేరుతో నీ కేమిటి అనుబంధం? అది సమసిపోతుంది
దూర తీరాలలో ఎక్కడో ఏకాంతంగా
దొర్లుకుంటూ వెళ్ళి ఒడ్డున పగిలైన అలలా…
లేదా, చీకటి కీకారణ్యంలో ఒక కేకలా.

నీ వాళ్ళ సమాధులమధ్య
ఒక స్పందనలేని గీతగా మిగులుతుంది;
అర్థం కాని భాషలో గజిబిజిగా
అల్లుకున్న ఒక సమాధి లిపిలా

అదేమిటి మరి? ఎప్పుడో గతించిన కాలం,
ఎన్నో పిచ్చి కలలమధ్య తప్పిపోయిన ఒక కల,
జ్ఞానదేవత కటాక్ష వీక్షణాలు
జ్ఞాపకాలుగా నీ ఆత్మపై ప్రసరించవులే.

ఒకవేళ నీకు బాధకలిగితే
నా పేరు నిట్టూరుస్తూ, ఆవరించిన
నిశ్శబ్దానికి చెప్పు, “జ్ఞాపకం నిజమే!
నాకోసం కొట్టుకునే గుండె ఒకటుండేది.”
.
అలెగ్జాండర్ పుష్కిన్
రష్యను కవి.

.

The Name

.

What is my name to you? ‘T will die:

a wave that has but rolled to reach

with a lone splash a distant beach;

or in the timbered night a cry …

 

‘T will leave a lifeless trace among

names on your tablets: the design

of an entangled gravestone line

in an unfathomable tongue.

 

What is it then? A long-dead past,

lost in the rush of madder dreams,

upon your soul it will not cast

Mnemosyne’s pure tender beams.

 

But if some sorrow comes to you,

utter my name with sighs, and tell

the silence: “Memory is true -

there beats a heart wherein I dwell.”

.

Alexander Pushkin

 6 June 1799 – 10 February 1837

Russian Poet

 

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/2001/04/name-alexander-pushkin.html

వ్రాసినది: NS Murty | నవంబర్ 18, 2014

What if … Nishigandha, Telugu, Indian

Silly! These evenings are always like that…

They gently walk through the open windows

And over the frail fagged countenances.  

 

A dewy flower flutters, swings and drops

Into the valley like a streak of light.

And a long reticent journey begins…

 

What if those nights hadn’t cared to visit

Brushing aside the catch of soft dusky sunshines?  

 

What if they didn’t play time and again

Like the haunting lyrics of the favorite song

The supposedly forgotten uninhibited laughters

And the concerns under the daily routine?!

Over the listlessly severing minute sands

The iterating I’s spraying from me

Amuse fancifully under the moonlight.

When will it dawn that the sought after was lost forever?!  

How many times ever you entreat, “Oh! Not now…”

The rain comes down…

With the counting of differences, and

Squaring out of obstinacies

The soul gets soiled within.

Why these nights dawn, I wonder!

Neither can they quench the thirst of this fictile bowl

Nor can they conceal it deftly.

 

Is it a sense of vacuity, or immutability?

Before the hands, stretched out for long into the darkness

In hope of an answer descending like a crescent,

Could be folded and withdrawn fully

The whiff amidst the leaves

And the birds in their nests

And the breaking of the seed in the soil

All steadily cease.

 

As the childhood story

Slowly unwinds as I slip into sleep

Suddenly, mother flashes in memory

And with her, her fever.

 

Does the sudden shuddering fear know

Why these nights come at all?

And having come once, why repeat over and over?

.

Nishigandha

Telugu, Indian

.

Nishigandha

Nishigandha

Kiran Yalamanchi, more popular by her pen name Nishigandha, was born and brought up in Vijayawada, Andhra Pradesh. She is an engineer by profession and is currently living in USA. In her own words: “Poetry is my invisible friend stands right next to me and holds my hand in every emotional stage! I don’t publish a lot but I do write more often.. almost everyday.”

 She is a blogger  since July 2007 running her blog మానసవీణ ( http://nishigandha-poetry.blogspot.com/ )

.

కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?

.

సాయంత్రాలెప్పుడూ ఇంతే
తెరిచిన కిటికీల్లోంచీ.. అలసిన మొహాలమీద నించీ
సుతారంగా నడిచెళ్ళిపోతుంటాయి…

కాంతిగా కదిలీ, ఊగీ, రెపరెపలాడీ, చెమ్మగిల్లిన ఒక పువ్వు

లోయలోకి జారిపడుతుంది
ఇంకొక సుదూర మౌన ప్రయాణం మొదలవుతుంది.

ఒడిసిపట్టుకున్న నీరెండల్ని తోసేసుకుంటూ
కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?

మర్చిపోయాననుకున్న నవ్వుల్నీ
మామూలైపోయానుకున్న బెంగల్నీ
ఇష్టమైన పాటలోని నచ్చిన పదాల్లాగా
మళ్ళీ మళ్ళీ వినిపించకపోతేనేం!?

నాలోంచి తొణికిపోయిన పలు నేనులు
వేలవేలుగా చీలిన క్షణాల ఇసుకరేణువుల్లో
వెన్నెలకుప్పలు ఆడుతుంటాయి
వెదుకుతున్నదే తప్పిపోయిందని ఏ ఝాములో తెలుస్తుందో!?

వద్దు వద్దు ఈవేళప్పుడొద్దని మొత్తుకుంటున్నా
మొదలయ్యే వాన..
మాటల లెక్కలూ, పంతాల బేరీజులూ
లోపలంతా ఒకటే వాన
తడిచి తడిచి చిత్తడి అయినా
మట్టిపాత్ర దాహాన్ని తీర్చనూలేక.. ఒడుపుగా మూయనూలేకా
ఎందుకొస్తాయో కొన్ని రాత్రిళ్ళు!

ఏదో లేనితనమా లేక ఏమీ మారనితనమా?

సమాధానం ఏ నెలవంక నవ్వులానో రాలిపడుతుందని

చీకట్లోకి చాచీ చాచీ ఉంచిన చేతుల్ని
ఖాళీగా వెనక్కి తీసుకునేంతలో…

ఆకుల మధ్యలో గాలీ
గూళ్ళల్లో పక్షులూ
విత్తనం చిట్లిన చప్పుడూ
అన్నీ సద్దుమణుగుతాయి

లీలగా మెదిలే పేదరాసి పెద్దమ్మ కధ
మగత మబ్బులో మెల్లగా చుడుతుండగానే
ఉన్నట్టుండి అమ్మ గుర్తొస్తుంది
అమ్మ కొచ్చిన జొరమూ గుర్తొస్తుంది!

ఒక్కసారిగా వణికించిన దిగులుకైనా తెలుసో లేదో

కొన్ని రాత్రుళ్ళు ఎందుకొస్తాయో?
వచ్చి వలయాలై ఎందుకు తిరుగుతాయో!?

 -

నిషిగంధ

వాళ్ళు నన్నో ముసలాడికి ఇచ్చేరు.
ఏ ఆనందమూ లేని పండు ముసలి.
బ్రహ్మముడి నవ్వునుండి బొమముడిలోకి.
అతని గుడిశలో
నా బాల్యం సమాధి,
కన్నీరు ఆగకుండా ప్రవహిస్తోంది
నేను కోరుకున్నది ప్రేమ
నా ఈడువాడే జోడు కావాలని.
చామనచాయతో నవ్వుతూ తుళ్ళే
దున్వా నన్ను ఇష్టపడ్డాడు.
ఓహ్! నన్ను గుంజకి కట్టిపడేస్తున్న పాత ఆచారాలు.
అయ్యో! నాకోసం ఎదురుచూస్తున్న భవిష్యత్తు!
దుఃఖం నన్ను చుట్టుముడుతోంది.
కన్నీళ్ళు జలజలా రాలుతున్నాయి.
ఆ బుల్లి పిట్టలు ఎంతహాయిగా ఉన్నాయో
గూడుకట్టుకుని రమిస్తూ.
వాటి  కువకువలకేరింతలలో
ఏ బాధ అయినా సమసిపోయేలా.
కానీ ఈ ముదుసలి గుడిసే
ఇక నా జీవిత సర్వస్వం
మిగిలింది ఎప్పుడూ ఆశల్లో విహరించడమే
ఊహల్లో దున్వాను తలుచుకోవడమే,
ఇలా కన్నీళ్ళు కార్చడమే.

ఊడ్గరూ నూనుక్కల్ (కేత్ వాకర్ )

3rd November 1920 – 16th September 1993

ఆస్ట్రేలియను ఆదివాసీ కవయిత్రి.

.

OODGEROO NUNUCCAL Australian Aboriginal Poetess Photo Courtesy: http://www.aiatsis.gov.au/collections/exhibitions/iaaw/women.html

OODGEROO NUNUCCAL
Australian Aboriginal Poetess
Photo Courtesy: http://www.aiatsis.gov.au/collections/exhibitions/iaaw/women.html

.

The Child Wife
-
They gave me to an old man,
Joyless and old,
Life’s smile to frown.
Inside his gunya
My childhood over,
And the tears fall down.

It was love I longed for,
Young love like mine,
It was Dunwa wanted me,
The gay and brown.
Oh, old laws that tether me!
Oh, long years awaiting me!
And the grief comes over me,
And the tears fall down.
Happy the small birds
Mating and nesting,
Shrilling their gladness
No grief may drown.
But an old man’s gunya
Is my life for ever,
And I think for ever,
And I think of Dunwa,
And the tears fall down.

.

Oodgeroo Noonuccal (AKA  Kath Walker)

3rd November 1920- 16th September 1993

Australian Aboriginal Poet.

Poem Courtesy: Srinivas Vasudev (https://www.facebook.com/adarinandu?fref=nf)

Older Posts »

వర్గాలు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 583గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: