వ్రాసినది: NS Murty | జూలై 20, 2012
Pablo Neruda
.
మిధ్యగా కనిపిస్తున్న ఈ బహుళంలో,
అన్ని ఆకులూ … ఈ ఆకే
అన్ని రేకులూ… ఈ పువ్వే.
అన్ని పళ్ళూ ఒక పండే
అన్ని చెట్లూ ఒక చెట్టే
ఒక్క పువ్వు ఈ ప్రపంచాన్ని నడిపించగలదు.
పావ్లో నెరూడా
(పైకి ఎంతో సరళంగా కనిపిస్తున్న ఈ కవితలో, గొప్ప తాత్త్విక సత్యం ఉంది. నిజానికి అన్ని రూపాలలో కనిపిస్తున్న పువ్వైనా, ఆకైనా, అవి ఒక్కటే. ఆ ఒక్కటీ మిగతావాటికన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఒక్క పువ్వు ఈ ప్రపంచాన్ని నడిపించగలదనడంలో, ఆశావహ దృక్పథమే కాదు, మానవతప్పిదాల వల్ల సృష్టిలో కొంత వినాశం జరిగినా, తిరిగి పుంజుకోగలదు అన్న భావన ఉంది అందులో.)

Pablo Neruda (1956) (Photo credit: Wikipedia)
.
All leaves are this leaf,
all petals, this flower
in a lie of abundance.
All fruit is the same,
the trees are only one tree
and one flower sustains all the earth.
(“Unity,” from Manual Metaphysics by Pablo Neruda; trans. by Ben Belitt)
Pablo Neruda
దీన్ని మెచ్చుకోండి:
Like Loading...
ఏకమేవా అద్వితీయం బ్రహ్మ
By: kastephale on జూలై 20, 2012
at 4:49 ఉద.
శర్మగారూ,
అన్నమాచార్యులు గారు తమ “బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే” కృతిలో సమస్త జంతుజాలమూ ఒకటే అని అంటే, ఇక్కడ కవి సమస్త వృక్షజాలమూ ఒకటే అంటున్నాడు. మనం స్థాణువులుగా ఉన్నా జంగమాలుగా ఉన్నా, అంతాఒక్కటే అన్న సత్యం అవగతమైతే మనం కుల మతాలపేరుతో కొట్టుకుని చావవలసిన అవసరం పడదు.
అభివాదములతో
By: NS Murty on జూలై 20, 2012
at 11:06 ఉద.
నిజమే, చిన్న వాఖ్యాలలో అనంతమైన భావము.
By: the tree on జూలై 20, 2012
at 6:43 ఉద.
భాస్కర్ గారూ,
నిజం. సత్యం ఎప్పుడూ simpleగానే ఉంటుంది. అదే అందులోని చిక్కు కూడా. మనం సంక్లిష్టతలకు అలవాటు పడిపోయి, చిన్న విషయాలను, ముఖ్యంగా మౌలికమైన సత్యాలను అర్థం చేసుకో లేము. అది చిన్నపిల్లవాడి స్థాయికి దిగి పాఠం చెప్పడం లాంటిది. మనలో ఆ బాల్యావస్థచేతనని పదిలంగా కాపాడుకున్నంతకాలం ఈ ప్రమాదం ఉండదు.
అభివాదములతో
By: NS Murty on జూలై 20, 2012
at 11:11 ఉద.
Murty garu….what a wonderfull translation…neruda telugu kavena…anipinchehntaga undi….
By: Arunbavera on జూలై 20, 2012
at 8:42 ఉద.
అరుణ్ బవేరా గారూ,
మీ అభిమానానికి కృతజ్ఞతలు.
అభివాదములతో
By: NS Murty on జూలై 20, 2012
at 11:14 ఉద.
murthy gaariki namasthe
baveraa gaarito Ekeebhavisthunnaanu saar
wonderful translation
with love and respects
bolloju baba
By: bollojubaba on జూలై 20, 2012
at 5:53 సా.
Baba garu,
thank you so much for the affectionate comments. We are missing you badly these days on the net.
with best regards
By: NS Murty on జూలై 20, 2012
at 7:05 సా.
.ఆరు పంక్తుల పద్యంలో అండ పిండ బ్రహ్మాండ సారాన్నంతా వడబొసినట్లు ఉంది మూర్తి గారు. and one flower sustains all the earth.- ఒక్క పువ్వే ఈ ప్రపంచాన్ని నడిపించగలదు-అన్న వాక్యం చదివినప్పుడు ఒక వింత పులకింత కూడా కలిగింది.మీ బ్లాగ్ పఠనం నాకు మంచి కాఫి తాగినంత సంతోషం కలిగిస్తుంది.
By: కర్లపాలెం హనుమంత రావు on జూలై 20, 2012
at 7:07 సా.
హనుమంతరావు గారూ,
మనవాళ్లు “ఏకం సత్ బహుధా వదంతి విబుధాః అన్నారు. ఈ కవితలో అంత చక్కని సత్యాన్ని ఆవిష్కరించేడు నెరూడా. అందుకే అతని పేరు చెబుతే పిచ్చెక్కిపోతారు జనం. కవిత్వంలో సౌందర్యంతో పాటు సత్యాన్నికూడ ఆవిష్కరించగల కవి అతను.
అయితే మీరూ నాలాగే కాఫీగత ప్రాణులన్నమాట.
మీ అభిమానానికి కృతజ్ఞతలు.
అభివాదములతో
By: NS Murty on జూలై 20, 2012
at 7:18 సా.
adbhutam.
By: ఫణీన్ద్ర పురాణపణ్డ on జూలై 20, 2012
at 7:38 సా.
ఫణీంద్రగారూ,
మీ బ్లాగులో ఇవాళ మధురాంతకం రాజారాం గారి కథ గురించి మీ గాలంలా లాగేసిన పరిచయం చదివేను. దానితో లింకు వెతికి ఆ కథ చదివేదాకా తోచలేదు. మీకు కృతజ్ఞతలు. కవిత్వమైనా, కథ అయినా ఆ స్థాయిలో ఉండాలి. అంతే కాదు రచయితా, కవీ అటువంటి ఋషిత్వాన్ని సంతరించుకుందికి తాపత్రయ పడాలి. అప్పుడే ఈ కవితలో నెరూడా చెప్పగలిగినట్టు, తక్కువ మాటలలో కూడా అనంతమైన భావాన్ని అందించగల శక్తి వస్తుంది. అదొక తపస్సు. కొందరికే సాధ్యపడుతుందేమో!
అభివాదములతో
By: NS Murty on జూలై 20, 2012
at 8:44 సా.
మీ వివరణ వలన కవిత పూర్తిగా అర్ధమైంది.
By: జ్యోతిర్మయి on జూలై 20, 2012
at 8:30 సా.
అమ్మా జ్యోతిర్మయీ,
కవిత్వం అర్థం చేసుకోవడంలో ఒక్కొక్కప్పుడు ఇబ్బంది దాని సందర్భం ఊహించడం. పెద్ద కవితలలో అయితే కవికి దానికి కావలసిన వాతావరణం కల్పించడానికి తగిన అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్నకవితలలో మనం చాలభాగం పదాలపొందికలోంచి దాన్ని ఊహించుకోవలసి ఉంటుంది. అది ఒకరకంగా మనకు పరిమితే(constraint).
ఆశీస్సులతో
By: NS Murty on జూలై 20, 2012
at 8:54 సా.