వసంతాగమనం… థామస్ కారీ, ఇంగ్లీషు కవి

శీతకాలం గడిచిందేమో,

ధరిత్రి తన హిమస్వచ్ఛమైన శుక్లాంబరాల్ని విడిచింది.

ఇక గడ్డిపరకలమీద మంచు పీచుమిఠాయిలా ,

స్వచ్ఛంగా పారే సెలయేటి తరగలమీదా

నిర్మలమైన సరస్సుమీదా మీగడతరకలా … పేరుకోదు

గోర్వెచ్చని ఎండ కొయ్యబారిన నేలని కరిగించి

మెత్తబరుస్తుంది; మరణించిన పిచ్చుక పునరుజ్జీవిస్తుంది.

చెట్టుతొర్రలో మత్తుగా పడుక్కున్న కోకిలనీ,

గండుతుమ్మెదల్నీ తట్టిలేపుతుంది.

కువకువలాడుతూ గాయకగణం స్వరరచనచేస్తూ

దర్పంగా వసంతుణ్ణి ప్రకృతిలోకి ఆదరిస్తాయి.

లోయలూ, కొండలూ, వనాలూ, సరికొత్త శోభతో

కళ్ళు కాయలుగాచేలా ఎదురుచూస్తున్న చైత్రాన్ని స్వాగతిస్తాయి.

.

థామస్ కారీ

1595 – 22 March 1640

ఇంగ్లీషు కవి.

.

.

Spring

.

Now that the winter’s gone, the earth hath lost

Her snow-white robes; and now no more the frost

Candies the grass or casts an icy cream

Upon the silver lake or crystal stream:

But the warm sun thaws the benumbèd earth,

And makes it tender; gives a sacred birth

To the dead swallow; wakes in hollow tree

The drowsy cuckoo and the bumble-bee.

Now do a choir of chirping minstrels bring

In triumph to the world the youthful spring!

The valleys, hills, and woods, in rich array,

Welcome the coming of the longed-for May.

Thomas Carew.

1595 – 22 March 1640

 English Poet

Poem Courtesy:

http://www.gutenberg.org/files/34237/34237-h/34237-h.htm#Page_6

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.