ఆలోచనలు… వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్, అమెరికను

వాళ్ళు నా ఆత్మని తూలికలదుప్పటిలో చుట్టారు

వెచ్చగా, హాయిగా ఉండేలా చూశారు

ఒక పాత పూజా కర్పటము వేసి

చక్కగా చెక్కిన కుర్చీలో జాగ్రత్తగా కూచోబెట్టేరు.

నా కాళ్ళకి బంగారు జోళ్ళు తొడిగేరు

అది బొటనవేలుదగ్గరా, మడమదగ్గరా నొప్పెట్టింది;

నా పాదాలు వయసు వాటాడి, అలసిపోయాయి,

ఎలా ఉన్నాయి అని అయినా అడగలేదు.

నేనిప్పుడేమయిపోయానో అని బెంగ వాళ్ళకి

నా కోసం కీచుగా అరుస్తూ వెతుకుతునారు;

పొడుగ్గా మొలిచిన గడ్డిదుబ్బుల్లో దాగున్నాను,

వాళ్ళు పక్కనుండి పోతుంటే నవ్వుతున్నాను.

.

వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్

1876 – 1959

అమెరికను

.

Cross-Currents

.

They wrapped my soul in eiderdown;

   They placed me warm and snug

In carvèd chair; set me with care

   Upon an old prayer rug.

They cased my feet in golden shoes

   That hurt at toe and heel;

My restless feet, with youth all fleet,

   Nor asked how they might feel.

 

And now they wonder where I am,

   And search with shrill, cold cry;

But I crouch low where tall reeds grow,

   And smile as they pass by!

.

Winifred Virginia Jackson

1876–1959

American

Poem Courtesy:

Anthology of Massachusetts Poets. 1922

Ed. William Stanley Braithwaite

http://www.bartleby.com/272/43.html

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.