ఎక్కడో ఒకచోట… క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి

ఏక్కడో ఒకచోట ఒకరుంటారు

ఎన్నడూ ఎరుగని ముఖం, ఎన్నడూ వినని గొంతు 

నే నడిగిన మాటకి

ఇంకా,  ఓహ్! ఇంకా ప్రతిస్పందించని.. హృదయం.

ఎక్కడో ఒకచోట, దగ్గరో, దూరమో

నేలలూ సముద్రాలకీ ఆవల, కనరాని చోట;

అలా తిరుగాడే చందమామకంటే దూరంగా

ప్రతిరాత్రీ దాని నడకని పరిశీలించే నక్షత్రానికి ఆవల…

ఎక్కడో ఒకచోట, దూరంగానో, దగ్గరో,

మధ్యలో ఒక గోడో, ఒక దడో అడ్డుగా ;

పచ్చికపరుచుకున్న నేలమీద

చివరి ఆకులు రాల్చే శిశిరంలా.

.

క్రిస్టినా రోజెటి

5 December 1830 – 29 December 1894

ఇంగ్లీషు కవయిత్రి.

.

.

 

Somewhere or Other

.

Somewhere or other there must surely be  

The face not seen, the voice not heard,    

The heart that not yet—never yet—ah, me!        

Made answer to my word.    

 

Somewhere or other, maybe near or far;          

Past land and sea, clean out of sight;       

Beyond the wandering moon, beyond the star    

That tracks her night by night.     

  

Somewhere or other, maybe far or near;   

With just a wall, a hedge, between;       

With just the last leaves of the dying year 

Fallen on a turf grown green.

.

Christina Rossetti

5 December 1830 – 29 December 1894

English Poetess

 

Poem Courtesy:

The Answering Voice: One Hundred Love Lyrics by Women. 1917.

Compiled by: Sara Teasdale (1884–1933).

http://www.bartleby.com/292/1.html

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.