మిత్రులు… జేమ్స్ మన్ గమ్ రీ, ఇంగ్లీషు కవి

ఒకరి తర్వాత ఒకరుగా మిత్రులు నిష్క్రమిస్తారు:
స్నేహితుడ్ని పోగొట్టుకోనివాడు ఎవడు?
ఇక్కడే ముగింపు చూడని
మనసుల కలయిక ఎక్కడా కనిపించదు.
ఈ నశ్వరమైన ప్రపంచమే మన విశ్రాంతి అనుకుంటే
బ్రతికినా, చచ్చినా, ధన్యుడైనవాడెవ్వడూ లేనట్టే

కాల ప్రవాహానికి అతీతంగా ,
మృత్యు లోయకి ఆవల,
ఖచ్చితంగా ఒక దివ్యమైన లోకం ఉంది
అక్కడ జీవితం క్షణికం కాదు;
జీవితంలోని అనుబంధాలు నిమిత్తమైన
నిప్పురవ్వల్లా ఎగిరి, జ్వలించి ఆరిపోయేవి కావు.

పైన ఒక ప్రపంచం ఉంది,
అక్కడ వియోగమన్న మాట తెలీదు;
కాలాతీతమైన ప్రేమ,
కేవలం మంచికొరకే సృష్టించబడ్డది;
ఇక్కడ చనిపోయిన వాళ్ళు
అక్కడకి కొనిపోబడతారని నమ్మకం.

అలా చుక్క తర్వాత చుక్క రాలిపోతుంది,
చివరికి అందరూ మరణించేదాకా ;
ఉదయం ఎలా ప్రవర్థమానమౌతూ
స్వచ్ఛమైన రోజుగా పరిణమిస్తుందో,
ఈ చుక్కలు శూన్యమైన రాత్రిలోకి గ్రుంకకుండా,
అవి స్వర్లోకపు ప్రకాశంలో దాక్కుంటాయి, అంతే!

.

 జేమ్స్ మన్ గమ్ రీ

(4 November 1771 – 30 April 1854)

ఇంగ్లీషు కవి

.

.

Friends

.

Friend after friend departs:        

Who hath not lost a friend? 

There is no union here of hearts,   

Which finds not here an end.

Were this frail world our only rest,       

Living or dying, none were blest.  

 

Beyond the flight of time,     

Beyond the vale of death,     

There surely is some blessèd clime  

Where life is not a breath;           

Nor life’s affections, transient fire, 

Whose sparks fly upwards and expire. 

  

There is a world above,         

Where parting is unknown;  

A whole eternity of love,              

Form’d for the good alone;  

And faith beholds the dying here   

Translated to that glorious sphere.

 

Thus star by star declines,    

Till all are pass’d away;               

As morning high and higher shines         

To pure and perfect day:      

Nor sink those stars in empty night,        

They hide themselves in heaven’s own light.

.

James Montgomery 

(4 November 1771 – 30 April 1854)

British Poet and Editor

 

Poem Courtesy:

The Sacred Poets of the Nineteenth Century. 1907.

Ed. Alfred H. Miles.

http://www.bartleby.com/294/7.html

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.