క్లుప్తంగా
నాది పుట్టుక, చదువు అన్నీ విజయనగరం. నేను డిగ్రీ వరకు మహారాజా కళాశాల లోనూ, తర్వాత విశాఖ పట్నం ఆంధ్రా యూనివర్సిటీ లో స్నాతకోత్తర విద్య పూర్తి చేసాను. ( M.Sc. Applied Mathematics (1970-72) and MA (English) 1982 – 84. ) ముందుగా స్మరించాలంటే నేను 11 , 12 తరగతులలో మా లెఖ్ఖలు మాష్టారు గంటి వెంకట రమణయ్య పంతులు (GVR మాష్టారు) గారిని స్మరించుకుంటాను. తర్వాత అదేసమయంలో మాకు ఇంగ్లీషు చెప్పిన AL ప్రసాద రావు మాష్టారు గారిని తలుచు కుంటాను. సాహిత్యం పట్ల అభిరుచికి ముందు మా నాన్నగారూ, అమ్మగారూ, తర్వాత నా ఇద్దరు అక్కలూ, డిగ్రీలో పాఠాలు చెప్పిన శ్రీ సాయినాథ శాస్త్రి గారూ కారణం. ఆంగ్లసాహిత్య వైపు నా దృష్టి మరలడానికి కొంతవరకు మాకు డిగ్రీలో King Lear బోధించిన బహుభాషాకోవిదుడూ, శ్రీ శ్రీ ఆరుద్ర వంటి హేమాహేమీలకు గురువైన శ్రీ రోణంకి అప్పల స్వామి మేష్టారి ఆ నాటకమే కారణం. అయితే 75 లో విజయవాడలో ఉద్యోగంలో చేరి ఒక్కడినీ ఉంటున్నప్పుడు సాహిత్యం పట్ల మమకారాన్ని ద్విగుణీ కృతం చేసిన గురుమిత్రులు Y. సుబ్రహ్మణ్య శర్మగారిని ఎలా మరిచిపోగలను?
.
యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్, టెక్సాస్ లో 2011 లో స్ప్రింగ్ సెమెస్టరులో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా జాయిన్ అయి Spring Semester పూర్తిచేసాను కాని అనారోగ్య కారణాలవల్ల వెనక్కి తిరిగి వెచ్చేశాను. ఇంతవరకు, మా మేనమామ RS కృష్ణ మూర్తి తో కలిసి The Palette” అన్న పేరుతో తెలుగులో 19 మంచి కథలని అనువాదం చేసి ప్రచురించడం, The Incidental Muses అన్న నా ఆంగ్ల కవితా సంకలనాన్ని ప్రచురించడం, Tangs of Telugu అన్న పేరుతో తెలుగులో లబ్ద ప్రతిష్టులైన కవుల కవితల అనువాదాలు ప్రచురించడం, సౌభాగ్య అన్న నా కవిమిత్రునితో కలిసి ” నువ్వూ- నేనూ, గానమూ- గళమూ” అన్న తెలుగు కవితా సంకలనం ప్రచురించడమూ జరిగింది. మా మేనమామకీ నాకూ 2000 సంవత్సరానికి “Katha – British Council South Asian Translation Award 2000 అల్లం శేషగిరి రావుగారి “మృగతృష్ణ” కథ అనువదానికి లభించింది.
Disclaimer: నా బ్లాగులో ఉంచిన చిత్రాలు వేటికీ నాకు అనుమతి లేవు. కేవలం వాటిని సాహిత్య ప్రయోజనం ఉద్దేశించి ఉపయోగించినవే తప్ప వేరు ఉద్దేశ్యం లేదు. ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లైన నాఆ దృష్టికి తీసుకువచ్చిన తక్షణం అటువంటి చిత్రాన్ని తక్షణమే తొలగిస్తానని హామీ ఇస్తున్నాను. (I don’t have permission for any of the pictures displayed in my blog. They are placed essentially keeping in view literary interest than anything else. If any /copyright holder / institution brings to my attention their objections / reservations for the display of any picture presented here, I assure that I would remove the objectionable picture immediately.)




అనువాదలహరి ప్రధానంగా తెలుగు కవితాభిమానులకు వి
శ్వకవిత్వాన్ని పరిచయం ఛేసేది అనుకుంటా.తెలుగు కవితల ఆంగ్లానువాదాలు ఇందులో అవసరమా(నిజంగా ఆ స్థాయి గల వాటిని మినహాయిస్తే) ఆలోచించండి మూర్తి గారూ! మరో కొత్త బ్లాగ్ మొదలపెట్టి మంచి మంచి కవితలను సవ్యాఖానంగా మీబోటి వారు పరిచయం చేస్తే మా బోటి వారికి ఉపయోగకరంగా ఉంటుంది.శ్రమతీసుకోవాలి మరి మీరు!
By: onlypoetryblog on ఆగస్ట్ 28, 2012
at 10:42 సా.