తొలిసంజ… షెల్లీ, ఇంగ్లీషు కవి

తొలిసంజ మేల్కొలపగలిగిన అన్నిటినీ మేల్కొలిపింది
స్వేచ్ఛగా తిరిగే పిచుకల్నీ, పిట్టల్నీ, కోయిలలనీ,
గొల్ల వనిత పాటల్నీ, తోటమాలి దోకుడుకత్తి చప్పుడునీ,
ప్రభాత ప్రార్థన ఘంటనీ, గండు తుమ్మెదలనీ:

మంచోడుతున్న మొక్కజోన్నకంకులపై మిణుగురులు సేదదీరుతున్నై,
విద్యార్థి సరిచెయ్యడం మరచిన లాంతరు వత్తుల్లా,
నదీ తీరాన్న అవి కొడిగడుతున్నాయి.

కందిరీగ తన ఝంకారం మరిచిపోయింది
కొండమీదా, మైదానం మీదా కీచురాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నాయి,
రైతు తుపాకికి చప్పుడుకి దౌడుతీస్తున్న ఏనుగుల మందలా
రాత్రి భయాలూ, పీడకలలూ, ప్రతి ఒక్కటీ
తొలికిరణానికి కొండెక్కిన దీపంతోపాటు
వాటి వాటి  చీకటివేట ముగించుకుని పరుగెడుతున్నై.

.

షెల్లీ

4 August 1792 – 8 July 182

ఇంగ్లీషు కవి.

.

PB Shelly Image Courtesy: http://www.theguardian.com/books/2010/jan/28/percy-bysshe-shelley-christopher-hitchens
PB Shelly
Image Courtesy:
http://www.theguardian.com/books/2010/jan/28/percy-bysshe-shelley-christopher-hitchens

.

Daybreak

.

Day had awakened all things that be,

The lark, and the thrush, and the swallow free,

And the milkmaid’s song, and the mower’s scythe,

And the matin bell and the mountain bee:

Fireflies were quenched on the dewy corn,

Glow worms went out, on the river’s brim,

Like lamps which a student forgets to trim:

The beetle forgot to wind his horn,

The crickets were still in the meadow and hill:

Like a flock of rooks at a farmer’s gun,

Night’s dreams and terrors, every one,

Fled from the brains which are its prey,

From the lamp’s death to the morning ray.

.

Percy Bysshe Shelley.

4 August 1792 – 8 July 1822

English Poet

 

Poem Courtesy:

Golden Numbers: A Book of Verse for Youth

Chosen and Classified by: Kate Douglas Wiggin and Nora Archibald Smith,

Doubleday, Page & Company, New York, 1909.

http://www.gutenberg.org/files/34237/34237-h/34237-h.htm#Page_1