మొర … ఎబ్ నెజర్ ఏలియట్, ఇంగ్లీషు కవి

చలిగా, లోతుగా, నల్లగా కెరటాలు సాగుతుంటాయి
ఎక్కడా గాలి ఊసు లేని సముద్రం మీద
ఎవరికీ ఎరుకలేని ఏ చారెడు నేలకోసమో!
.
ఆ చీకటి అలలతరగలమీద తేలుతూ
వినీ వినిపించక, శతృ, మిత్రుల శోకాలు,
ఎవరికీ తెలియని ఏ నేలనో వెతుక్కుంటూ పోతాయి.

దూరాన రక్షించమంటూ విధివంచితుడెవరో
అరుస్తున్నాడు; ఈ లోకంలోని బాధలనుండి విముక్తుడై
మిగతావాళ్ళలాగే ఎవరికీ తెలియని తీరానికి పోతున్నాడు.

ఆ వెళుతున్నవాని వెంట కొన్ని వేల మంది పోయినా
గాలి ఆడని ఆ ప్రదేశానికి, ఒంటరిగానే పోతున్నాడు,
ఎవరి ఊహకీ అందని ఆ దేశానికి.

ఆ గాలి అల్లాడని చోటుకి అందరూ వెళ్ళవలసిందే,
అయితే, ఆ వెళ్ళేవాడికోసం మాత్రం ఎవరూ పోరు;
ఆ వెళ్ళిన చోటునుండి, ఎందుకు తిరిగిరాడో ఏ ఒక్కడికీ తెలీదు.

అయినా సరే,  ఈ బాధామయ లోకం నుండి
పదిమందితో పాటే అరుస్తూ పోతున్న వాడు, ఎవరితో
పునస్సమాగం కోరుతున్నాడు? వారితోనా? మృత్యువుతోనా?

ఏ గాలీ చొరని చోట దేమునితో ఏకాంతంగా
మృత్యువు తన నీడగా, నశించి, అతడు పోతాడు.
దేముడున్నాడని నీడే నిరూపిస్తుంది.

గాలి చొరలేని,  లోతుదొరకని అఖాతమా!
ఎవ్వరూ కనుగొనలేని భూఖండమా!
దైవమే సర్వస్వమని అతని నీడే ఋజువుచేస్తుంది.

.

 ఎబ్ నెజర్ ఏలియట్

17 March 1781 – 1 December 1849

ఇంగ్లీషు కవి

.

Ebenezer Elliott

.

Plaint

.

Dark, deep, and cold the current flows

Unto the sea where no wind blows,

Seeking the land which no one knows.

O’er its sad gloom still comes and goes

The mingled wail of friends and foes,

Borne to the land which no one knows.

Why shrieks for help yon wretch, who goes

With millions, from a world of woes,

Unto the land which no one knows?

Though myriads go with him who goes,

Alone he goes where no wind blows,

Unto the land which no one knows.

For all must go where no wind blows,

And none can go for him who goes;

None, none return whence no one knows.

Yet why should he who shrieking goes

With millions, from a world of woes,

Reunion seek with it or those?

Alone with God, where no wind blows,

And Death, his shadow—doom’d, he goes:

That God is there the shadow shows.

O shoreless Deep, where no wind blows!

And thou, O Land which no one knows!

That God is All, His shadow shows.

.

Ebenezer Elliott

17 March 1781 – 1 December 1849

English Poet

 

Poem Courtesy:

The Oxford Book of Victorian Verse. 1922.

Compiler: Arthur Quiller-Couch.

http://www.bartleby.com/336/19.html

.