చెరగని అందం… థామస్ కేరీ, ఇంగ్లీషు కవి

ఎవడు గులాబి వంవంటి చెక్కిళ్ళనిప్రేమిస్తాడో

పగడాలవంటి పెదాలని ఆరాధిస్తాడో

లేదా చుక్కలను బోలిన కనుదోయినుండి 

తన ప్రేమజ్వాలను ఎగదోసుకుంటాడో;

కాలం వాటిసొగసులొక్కొక్కటీ హరిస్తున్నకొద్దీ

అతని ప్రేమ కూడా క్రమంగా క్షీణించవలసిందే 

 

కాని, అచంచలమూ, నిర్మలమూ ఐన మనసూ, 

సుకుమారమైన బావనలు, అదుపులోని కోరికలు

అన్యోన్య అనురాగంతో మనసులు పెనవేసుకున్నపుడు 

వారి మధ్య అనురాగం ఎనడూ నశించదు.

ఇవి ఏవీ లేనప్పుడు ఎంత అందమైన చెక్కిళ్ళైనా

పెదాలైనా, కనుదోయి అయినా, నేను అసహ్యించుకుంటాను.

 

థామస్ కేరీ,

1595 – 22 March 1640

ఇంగ్లీషు కవి

 

 

 

The Unfading Beauty

 

HE that loves a rosy cheek,       

  Or a coral lip admires,  

Or from star-like eyes doth seek         

  Fuel to maintain his fires:        

As old Time makes these decay,                  

So his flames must waste away.

 

But a smooth and steadfast mind,       

  Gentle thoughts and calm desires,     

Hearts with equal love combined,       

  Kindle never-dying fires.           

Where these are not, I despise   

Lovely cheeks or lips or eyes.

.

Thomas Carew.

1595 – 22 March 1640

English Poet

 

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Ed: Arthur Quiller-Couch, 1919.

http://www.bartleby.com/101/292.html

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.