సగటు మనిషి … జేమ్స్ మన్ గమ్ రీ, ఇంగ్లీషు కవి

ఒకప్పుడు, యుగాలు గడవకముందు
ఒక మానవుడు ఉండేవాడు. అతనెవడూ?
మర్త్యుడు! అతన్ని నువ్వు ఎలా చిత్రించినా
అచ్చం నీలాగే ఉంటాడు.

అతనెక్కడపుట్టేడో తెలీదు,
అతనెక్కడ మరణించేడో కూడా తెలీదు,
అతని పేరు భూమ్మీంచి తుడుచుకుపోయింది;
అదొక్క సత్యమే మిగిలి ఉంది.

సుఖమూ దుఃఖమూ, ఆశా, భయమూ
అతని మనసులో ఒకదాని వెనక ఒకటి నిలిచేయి;
అతని బ్రహ్మానందం, విపత్తూ, నవ్వూ, కన్నీరూ,
సర్వస్వమూ తెర మాటున మరుగుబడ్డాయి.   

అతని గుండె చప్పుడూ వడీ, నీరసించిన శరీరం,
ఒకసారి ఎగసి మరోసారి పతనమైన భావోద్వేగాలూ;

ఇవన్ని అతను అనుభవించేడని తెలుస్తోంది
ఎందుకంటే, అందరికీ ఇవి అనుభవమే కనుక.

అతను బాధపడ్డాడు–  కానీ అతని బాధలు గట్టెక్కాయి;
అతను సుఖపడ్డాడు– ఆ సుఖాలూ కడతేరిపోయాయి;
స్నేహితులుండేవారు — ఆ స్నేహితులూ గతించేరు;
అతని శత్రువులు — వాళ్ళూ కాలగర్భంలో కలిసిపోయేరు.

అతను ప్రేమించాడూ, కానీ అతను ఎవర్ని ప్రేమించాడో
ఆ ఆచూకీ సమాధి పొరల్లో అజ్ఞాతమై ఉంది:
ఓహ్! ఆమె ఎంత అందంగా ఉండేదో! ఏమి లాభం?
ఆ అందాన్ని సమాధిపాలవకుండా ఏదీ కాపాడలేకపోయింది.

నువ్విప్పుడు ఏమేమి చూసేవో అతను చూసేడు;
నీనేవి బాధించేయో అవే అతన్నీ బాధించేయి:
నువ్వు లోనయిన మార్పులకి అతనూ లోనయ్యాడు,
అతను నువ్వు రేపు ఏది కాబోతున్నావో, అదే అయాడు.

మారుతున్న ఋతువులు, రేయింబవళ్ళు,
సూర్యచంద్రులూ, నక్షత్రాలూ, ఈ భూమీ, నేలా
ఒకప్పుడు అతని స్వంతం; జీవితం, వెలుగులూ
ఇప్పుడూ ఉన్నా, వాటి ఉనికి అతనికి నిరర్థకం.

ఒకప్పుడు వాటి అందాలు చిలికించిన
మేఘాలూ, సూర్యకిరణాలూ, ఇప్పుడు
ఆకాశంనుండి ఎప్పుడుపోయాయో తెలియకుండా
వాటి జాడలుకూడా లేకుండా నిష్క్రమించాయి.

మానవ జాతి చరిత్ర, శిధిలాలు సర్వస్వం,
ఈ సృష్టి మొదలైన దగ్గరనుండీ
అతని గురించి మరి ఏ గుర్తులూ మిగల్చలెదు
“ఆది మానవుడు ఉండేవాడు” అన్న విషయం తప్ప.

.
జేమ్స్ మన్ గమ్ రీ,

(4 November 1771 – 30 April 1854)

ఇంగ్లీషు కవి

 

.

 

The Common Lot

 .

 

Once, in the flight of ages past, 

There lived a man:—and WHO WAS HE?—         

Mortal! howe’er thy lot be cast,

That man resembled thee.         

 

Unknown the region of his birth,        

The land in which he died unknown:  

His name hath perished from the earth;         

This truth survives alone:—      

 

That joy and grief, and hope and fear,

Alternate triumph’d in his breast;        

His bliss and woe,—a smile, a tear!—

Oblivion hides the rest.   

 

The bounding pulse, the languid limb,

The changing spirits’ rise and fall;      

We know that these were felt by him, 

For these are felt by all.  

 

He suffer’d,—but his pangs are o’er;  

Enjoy’d,—but his delights are fled;    

Had friends—his friends are now no more;  

And foes,—his foes are dead.   

 

He loved,—but whom he loved, the grave    

Hath lost in its unconscious womb:    

O, she was fair!—but nought could save      

Her beauty from the tomb.        

 

He saw whatever thou hast seen;        

Encounter’d all that troubles thee:       

He was—whatever thou hast been;     

He is—what thou shalt be.        

 

The rolling seasons, day and night,     

Sun, moon, and stars, the earth and main,               

Erewhile his portion, life, and light,    

To him exist in vain.       

 

The clouds and sunbeams, o’er his eye         

That once their shades and glory threw,        

Have left in yonder silent sky             

No vestige where they flew.     

 

The annals of the human race,  

Their ruins, since the world began,     

OF HIM afford no other trace   

Than this, THERE LIVED A MAN!            

.

James Montgomery

English Poet and Editor

(4 November 1771 – 30 April 1854)

 

Poem Courtesy:

The Book of Georgian Verse.  1909.

Ed: William Stanley Braithwaite. 

http://www.bartleby.com/333/693.html

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.