అలసితి… సర్ హెన్రీ పార్క్స్, ఆస్ట్రేలియన్

కలతపడ్డ మనసుని మరింత కృంగదీస్తున్న

ఈ అంతులేని యుద్ధానికి అలసిపోయాను;

గమ్యం చేరుకునే వేళకి, కత్తితోకొట్టినట్టు

ఆలోచనలు సొమ్మసిలేలా వేటువేస్తున్నాయి.

దుఃఖకారణమైన సుఖాలవేటకి అలసిపోయాను.

అవి కల్పించిన భ్రమలు నుసిలా రాలుతున్నాయి;

అవి ఉన్న సంతోషాలను హరించడమే గాక

బాధల భస్మ కలశలోకి ఎముకల్ని ఎత్తుతున్నాయి.

సంకుచితమైన మార్గాలలో నడుస్తూ

భంగపడ్ద ఆశలకి అలసిపోయాను;

అవి పేలవమైన లక్ష్యాలకి శక్తిధారపోసేలా,

తప్పుడు చేతలకీ, వక్రమార్గాలకీ ప్రేరేపించేయి.

మంచి చెడుల సంకరమైన యుద్ధంలో

పోరాడే సమూహాన్ని చూసి అలసిపోయాను;

తప్పు చేసిన వారి హహాకారాలకీ

ఆకలితీరని చీకటికీ అలసిపొయాను.

అలసి అలసి సొలసిపోయిన మనసా!

అణగదొక్కబడి, చూర్ణమై,మూగబోయావు;

నిన్ను నీకు తెలిసినట్టుగా మరొకరికి తెలీదు

అంతరాయంలేని విశ్రాంతి ఇక ఎప్పుడు వచ్చేను?

 .

సర్ హెన్రీ పార్క్స్

May 27, 1815- April 27, 1896

ఆస్ట్రేలియన్

 

Image Courtesy:

http://www.britannica.com/EBchecked/topic/444134/Sir-Henry-Parkes

Weary

.

Weary of the ceaseless war

  Beating down the baffled soul,—

Thoughts that like a scimitar

  Smite us fainting at the goal.

Weary of the joys that pain—

  Dead sea fruits whose ashes fall,

Drying up the summer’s rain—

  Charnel dust in cups of gall!

Weary of the hopes that fail,

  Leading from the narrow way,

Tempting strength to actions frail—

  Hand to err, and foot to stray.

Weary of the battling throng,

  False and true in mingled fight;

Weary of the wail of wrong,

  And the yearning for the night!

Weary, weary, weary Heart!

  Lacerated, crush’d and dumb.

None to know thee as thou art!

  When will rest unbroken come?

.

Sir Henry Parkes

May 27, 1815- April 27, 1896

Australian Politician and Journalist

Poem Courtesy:

The Oxford Book of Australasian Verse.  1918.

Comp: Walter Murdoch (1874–1970).

http://www.bartleby.com/249/2.html

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.