నే పోయిన తర్వాత … హెన్రీ ఆస్టిన్ డాబ్సన్, ఇంగ్లీషు కవి

నే పోయిన తర్వాత

నా సమాధి కంటే ఎత్తుగా గడ్డిమొలిచినపుడు …

ఇష్టంగానో అయిష్టంగానో ప్రపంచం నన్ను

చిరుకవిగా గుర్తించడానికి బేరీజు వేస్తుంటుంది

అప్పుడు నేను ప్రశ్నించనూ లేను, జవాబూ చెప్పనూలేను.

నేను ఉదయాకాశాన్ని చూడనూ లేను

నడిరేయి గాలి నిట్టూర్పులు వినలేను

నే పోయిన తర్వాత అందరు మనుషుల్లాగే

నేనుకూడా మూగగా ఉండిపోతాను.

అయినప్పటికీ, ఇపుడు నేను బ్రతికుండగా,

ఎవరైనా ఇలా చెప్పగలిగితే సంతోషిస్తాను:

“అతను తన కలాన్ని కళకి అంకితం చేశాడు

సిగ్గుచేటు పనులకీ, స్వలాభానికీ కాదు.”

అనేవారు లేరా? నే పోయిన తర్వాత

నన్నెవరూ గుర్తుంచుకొనరు గాక!

.

హెన్రీ ఆస్టిన్ డబ్సన్

18 January 1840 – 2 September 1921

ఇంగ్లీషు కవి

.

Henry Austin Dobson

.

In After Days

(Rondeau)

In after days when grasses high         

O’er-top the stone where I shall lie,     

  Though ill or well the world adjust   

  My slender claim to honour’d dust,   

I shall not question nor reply.

I shall not see the morning sky;

I shall not hear the night-wind sigh;    

  I shall be mute, as all men must        

      In after days!  

But yet, now living, fain would I

That some one then should testify,      

  Saying—’He held his pen in trust      

  To Art, not serving shame or lust.’    

Will none?—Then let my memory die

      In after days!

.

Henry Austin Dobson.

18 January 1840 – 2 September 1921

English Poet and Essayist

 (Note:

Rondeau: a short poem of fixed form, consisting of 13 or 10 lines on two rhymes and having the opening words or phrase used in two places as an unrhymed refrain.)

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Arthur Quiller-Couch, ed. 1919. 

http://www.bartleby.com/101/826.html

 

“నే పోయిన తర్వాత … హెన్రీ ఆస్టిన్ డాబ్సన్, ఇంగ్లీషు కవి” కి 3 స్పందనలు

  1. “ఏగతి రచించినన్ సమకాలికులెవ్వరు మెచ్చరే గదా” అని “చామకూర వేంకన్న” వాపోయాడు ఈ కవిలాగే..

    మెచ్చుకోండి

    1. శర్మగారూ,

      నమస్తే. మీరు రాసినది చదివిన తర్వాత నాకు ఈ మధ్యనే చదివిన ఈ విషయం గుర్తొచ్చింది. వీశ్వనాథ సత్యనారాయణ గారూ, ఝరుక్ శాస్త్రీ, మరొక కవీ/ సాహిత్యాభిలాషీ రైల్లో ప్రయాణిస్తుండగా విశ్వనాథవారు బెర్తు మీద పడుక్కుందికి వెళ్ళారట. అప్పుడే కంపార్ట్మెంటులోకి ఎక్కిన ఇద్దరు సామాన్య ప్రయాణీకులు సాహిత్యాన్ని గురించి మాటాడుకుంటూ, అందులో ఒకరు విశ్వనాథవారి ప్రతిభని కొనియాడుతూ, ఒక పద్యాన్ని ఉటంకించి దాని విశేషాల్ని చెప్పుకుంటూ పోయాడట. వాళ్ళ స్టేషను రాగానే వాళ్ళు దిగిపోయారట. వాళ్ళు వెళ్ళిపోగానే, ఝరుక్ శాస్త్రీ విశ్వనాథవారితో “వింటున్నావా?” అని అడిగారట. అని, “వాళ్ళెవ్వరో కనుక్కుందునా?” అని కూడా అడిగారట. దానికి ఆయన, “విన్నాను. నేను బతికుండగా నా కవిత్వం గురించి మంచో చెడో ఇలా చెప్పాలి గాని, నే పోయిన తర్వాత దానిగురించి ఎంత చర్చించినా, నాకేమి ప్రయోజనం” అన్నారట.
      కవులకి తమగురించి నలుగురూ మంచిగా చెప్పుకోవాలని ఉంటుంది. (ఈ విషయంలో వాళ్ళు సామాన్య మానవనైజానికంటే భిన్నం కరు). మన ఆదర్శాలు, ఆశయాలు, మన సమర్థత గురించి మనకున్న అభిప్రాయాలూ వేరు, మనం మన కళద్వారా, ప్రవర్తనద్వారా ఇతరులకి చూపించేది వేరు. ప్రజలెప్పుడూ మన మాటలబట్టి గాక చేతలబట్టి అంచనా వేస్తారు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

      1. మంచి సంగతి విన్నానండీ

        మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.