సాయంస్తుతి… ఫిల్లిస్ వ్హీట్లీ, ఆఫ్రికను అమెరికను కవయిత్రి

సూర్యుని చివరి వెలుగులు తూరుపుని విడిచిపెట్టగానే

రోదసి  ఒక్క సారి ఘంటరావాలతో నిండిపోయింది  

అద్భుతమైన దృశ్యం! అప్పుడే వికసిస్తున్న వసంతపు

సుగంధాలని చిరుగాలి నలుదిక్కులా మోసుకొస్తోంది.

సెలయేళ్ళు గలగలమంటున్నాయి; పక్షులు నవరాగాలాలపిస్తున్నాయి;

గాలిలో వాటి సమ్మిళిత సంగీతం తెరలు తెరలుగా తేలియాడుతోంది.

ఆహ్! ఆకాశంనిండా ఎన్ని అందమైన రంగులు అలముకున్నాయి.  

పడమరమాత్రం ముదురు ఎరుపురంగును అద్దుకుంది

నల్లని చీకటి తెరలను దించడంతో పాటు

వెలుగులనూ విరజిమ్మే సృష్టికర్త సంకీర్తనలతో నిండి

అవనిమీద ప్రాణంతో స్పందించే దేవాలయాలైన మా హృదయాలు

సకల సద్గుణలతోనూ భాసించు గాక!

దివ్యమై, సంస్కారవంతమై ఉదయాన్నే మేల్కొనుగాక.

నిత్యనైమిత్తికాల జంజాటము పునః ప్రాంభమయినపుడు

వాటి ప్రలోభాలనుండి దూరంగా స్వచ్ఛంగా ఉండుగాక.

రాత్రి పదముద్రల భారానికి నా కళ్ళు బరువెక్కుతున్నాయి.

గీతమా! ఇక చాలు. తిరిగి ప్రభాతమయే దాకా శలవు.

.

 ఫిల్లిస్ వ్హీట్లీ

1753 – December 5, 1784

ఆఫ్రికను అమెరికను కవయిత్రి

.

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

ఫిలిస్ వ్హీట్లీ (1753 – 5, డిశెంబరు, 1784)

మొట్టమొదటి ఆఫ్రికన్- అమెరికన్ కవీ/ కవయిత్రి

ఫిలిస్ వ్హీట్లీ జీవితం చాలా చిత్రమైనది. తన ఏడవయేట నేటి సెనెగల్/ జాంబియాప్రాంతాలనుండి అపహరింపబడి “ఫిలిస్” అన్న నావలో అమెరికాలోని బోస్టను నగరానికి తరలింపబడింది. అదృష్టవశాత్తూ  ఒక ధనిక వర్తకుడు, ఆదర్శభావాలు కల జాన్ వ్హీట్లీ అన్న అతను తన భార్యకు సేవకురాలిగా ఆమెను కొనుక్కున్నాడు. అయితే వాళ్ళింట్లోనే ఆమె నేర్చుకున్న చదువులో అపురూపమైన ప్రతిభకనబరచడంతో ఆమెకు ఎక్కువ అవకాశాలు కల్పించాడు.  బానిసత్వం ప్రబలంగా ఉన్నరోజుల్లో, బానిసకు విద్యావకాసాలు కల్పించడమంటే, అందులోనూ ఒకస్త్రీకి, అది అపూర్వమే.  12 ఏళ్ళ వయసువచ్చేసరికి ఆమె ఇంగ్లీషుభాషే కాకుండా, గ్రీకు, లాటిను భాషల్లోని కావ్యాలను చదవనూ, బైబిలోని క్లిష్టమైన భాగాలను చదవనూ  నేర్చుకుంది. ఆమె మీద పోప్, మిల్టన్, హోమర్, వర్జిల్ ల ప్రభావం బాగా ఉంది. ఆమె త్వరలోనే కవిత్వ రాయడం ప్రారంభించింది. ఆరోజుల్లో ఒక తెల్ల కుర్రవాడు కూడ ఆ వయసులో సాధించలేని భాషా పాండిత్యానికీ, కవిత్వానికీ ఒక పక్క ఆశ్చర్యమూ, ఇంకొక పక్క అసూయతో కొందరు ఆమె రాసిన కవిత్వం  ఆమెది కాదని కోర్టులో వ్యాజ్యం వేస్తే, ఆమెను పండితులు పరీక్షించి ఆమె రాసినవే అని నిర్థారణ చెయ్యడంతో బాటు ఒక ధృవీకరణపత్రం కూడా ఇచ్చారు. అంత నమ్మశక్యం కానిది ఆమె ప్రతిభ.

ఆమె కథనే బానిసత్వ నిర్మూలనకు నడుము కట్టుకున్న వాళ్ళంతా, బానిసత్వానికి అనుకూలంగా మాటాడేవాళ్ళు చెప్పే “నీగ్రోలకు స్వంత తెలివితేటలు ఉండవు” అన్న వాదనను ఖండించడానికి వాడుకున్నారు.

విధి ఎంత దాఋణంగా ఉంటుందో చెప్పడానికి కూడా ఆమె జీవితం ఒక ఉదాహరణే. 1778 లో జాన్ వ్హీట్లీ  తను వ్రాసిన వీలునామాలో తన మరణానంతరం ఆమెకు బానిసత్వం నుండి విముక్తి ప్రసాదిస్తే (అప్పటికే ఆమె  యజమానురాలు మరణించింది) తను స్వాతంత్ర్యముగల  ఇంకొక నీగ్రోను పెళ్ళిచేసుకుంది. అయితే వ్యాపారం లో దెబ్బతిని అతను జైలుపాలయితే, ఉదరపోషణార్థం తను బానిసగా ఉన్నప్పుడు ఏ పనులయితే చేయనవసరం లేకపోయిందో, స్వతంత్రురాలుగా ఉన్నప్పుడు అదే పనులుచెయ్యవలసి వచ్చింది. చివరకి తన 31 వ ఏట దారిద్ర్యం లో మరణించింది.

 

.

An Hymn to Evening

.

Soon as the sun forsook the eastern main
The pealing thunder shook the heav’nly plain;
Majestic grandeur! From the zephyr’s wing,
Exhales the incense of the blooming spring.
Soft purl the streams, the birds renew their notes,
And through the air their mingled music floats.
Through all the heav’ns what beauteous dies are spread!
But the west glories in the deepest red:
So may our breasts with ev’ry virtue glow,
The living temples of our God below!
Fill’d with the praise of him who gives the light,
And draws the sable curtains of the night,
Let placid slumbers sooth each weary mind,
At morn to wake more heav’nly, more refin’d;
So shall the labours of the day begin
More pure, more guarded from the snares of sin.
Night’s leaden sceptre seals my drowsy eyes,
Then cease, my song, till fair Aurora rise.

.

Phillis Wheatley

1753 – December 5, 1784

First African- American Poetess 

Poem Courtesy:

http://etc.usf.edu/lit2go/206/poems-on-various-subjects-religious-and-moral/4893/an-hymn-to-the-evening/

 

Wheatley was very likely kidnapped at the age of 7 from Senegal / Gambia and brought to British-ruled Boston, Massachusetts on July 11, 1761, on a slave ship called The Phillis. She was purchased as a slave by a progressive wealthy Bostonian merchant and tailor John Wheatley, as a personal servant to his wife Susannah. Wheatley’s, particularly 18 years-old Mary Wheatley, gave Phillis an unprecedented education. It was a luxury rarest of its kind for an enslaved person and more so, for a female of any race those days. By the age of twelve, Phillis was able to read Greek and Latin classics and difficult passages from the Bible. She was strongly influenced by the works of Pope, Milton, Homer, Horace and Virgil and she even began writing poetry. Wheatley’s work was frequently cited by many abolitionists to combat the charge of innate intellectual inferiority among blacks and to promote educational opportunities for African Americans.

 It was a quirk of fate that after 1778, when John Wheatley legally freed her from the bonds of slavery by his will, she was forced, while free, to do what she was exempted from when she was a slave… as domestic servant (and scullery) for survival. And she ultimately died poor at 31.