సౌందర్యం… ఆర్మెల్ ఒకానర్, అమెరికను

(… మన అవగాహన పరిధి దాటి సృష్టిలో కనిపించే మంచిదనమే… ఏకకాలంలో అందానికి లక్షణమూ, జన్మస్థానమూ కూడ: ఈ ప్రాధమికమైన సౌందర్యం, ప్రాధమికమైన మంచిదనం రెండూ ఒకచోటే ఉంటాయి… అందుకే మంచిదనాన్ని ఆశ్రయించే అందం ఉంటుంది… ప్లాటినస్)

సూర్యుడు ఏకకాలంలో చాలాచోట్ల ప్రకాశిస్తాడు,
సౌందర్యం అంతరాంతరాల్లో దాక్కుంటుంది.
ఒక్క వెలుగే ఎన్నో ముఖాలని దీపించి
లోపాలు చూపి ఉత్కృష్టసౌందర్యాన్ని నిరూపిస్తుంది
ప్రతి పర్వతం, ఆకాశం, నదీ
“భగవంతుడు ప్రసాదించే ఏ వరం నాశనంలేనిది?” అని
పదే పదే నే నడిగే ప్రశ్నలకి
దేముని సమాధానాన్ని చెబుతున్నట్టుంటాయి;
అయినా నేను సందేహాలతోనూ, సరిపోలికలతోనూ
నా అలౌకికమైన ఆనందాన్ని ధ్వంశం చేసుకుంటాను.
భగవంతుడే అవిచ్ఛిన్నమైన సంపద…
కాలాతీతమైన సౌందర్యం నా పాలు.
.

The Catholic world పత్రికలో ప్రచురితం
.
ఆర్మెల్ ఒ కానర్

అమెరికను

.

Beauty

(… and The Good, which lies beyond is the Fountain at once and Principle of Beauty: the Primal Good and the Primal Beauty have the one dwelling-place and, thus, always, Beauty’s seat is There.—Plotinus.)

The Sun shines bright in many places,

Beauty stoops into the vault;     

One Light illumines many faces,         

Shows perfection through the fault.    

And every mountain, sky or river       

Holds one heavenly reply         

To my questions, from the Giver        

Of the Gift that cannot die.       

Yet I destroy my purest pleasure        

While I hesitate, compare.         

God is the undivided Treasure …       

Timeless Beauty is my share.

.

  (The Catholic World)

.

Armel O’Connor

Anthology of Magazine Verse for 1920.  1920.

William Stanley Braithwaite, ed. (1878–1962). 

http://www.bartleby.com/273/4.html

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.