డయొజినెస్… మాక్స్ ఈస్ట్ మన్, అమెరికను

ఒక పాక, ఓ చెట్టూ
ఓ కొండ వాలు,
పచ్చిక బలిసిన మైదాన ప్రశాంతత
నాకు చాలు, మరేం కోరను.
దేవుడైనా, మహరాజైనా
తన నీడని నామీంచి తప్పించమంటాను.
.

మాక్స్ ఈస్ట్ మన్

అమెరికను
.

ఈ కవితని అర్థం చేసుకుందికి చిన్న వివరణ అవసరం.

(డయొజినెస్ ఆఫ్ సైనోప్ (క్రీ. పూ. 412/ 404 – 323 ) ఒక గ్రీకు తత్త్వవేత్త.   అతను మాటలలో కంటే, ఆచరించడం ద్వారా మాత్రమే విలువలు బాగా అవగతమౌతాయని నమ్మిన వాడు. తనని తాను ఏ దేశానికో ప్రాంతానికో చెందినట్టు ప్రకటించుకోకుండా, తాను “విశ్వనరుడిని” అని చెప్పుకున్నాడు. ఒక సారి కోరింత్ లో అతను ఎండలో విశ్రాంతి తీసుకుంటూండగా, అలెగ్జాండర్ ది గ్రేట్ అతని పేరు విని, దర్శించుకుని, “నేను మీకు ఏమైనా సహాయము చెయ్యగలనా?” అని వినయంగా అడిగేడట. దానికి అతను  “నామీద ఎండపడకుండా అడ్డు నిలబడ్డావు. పక్కకి తప్పుకుంటే చాలు” అన్నాడట.  ఈ కవిత ఆఖరి పాదంలో చెప్పిన విషయం దానిమీద ఆధారపడి వ్రాసినది.)

 

.

Diogenes

.

A hut, and a tree,

And a hill for me,

And a piece of a weedy meadow.

I’ll ask no thing,

Of God or king,

But to clear away his shadow.

.

Max Eastman

January 4, 1883 – March 25, 1969

American

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/101.html

(Note:

Diogenes of Sinope (412 or 404 BCE to 323 BCE) was a Greek Philosopher who believed virtue was better revealed in action than in theory. He claimed himself a citizen of the world than claiming allegiance to one place.   There was a legend when Alexander the Great met him in Corinth. Diogenes was relaxing in the sunlight in the morning, Alexander, thrilled to meet the famous philosopher, asked if there was any favor he might do for him. Diogenes replied, “Yes, stand out of my sunlight”.  That was the reference yo the last line of the poem.)

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.