పరంపర… మార్గరెట్ వాకర్, అమెరికను కవయిత్రి

మా అవ్వలూ అమ్మమ్మలూ బలమైనవాళ్ళు

వాళ్లు నాగలివెంట నడిచి, ఒళ్ళు వంచిపనిచేసేవారు

వాళ్లు విత్తనాలు నాటుతూ పొలమంతా తిరిగే వాళ్ళు

వాళ్ళు నేలపని చేసి, పంటపండించేవారు.

వాళ్ళు దృఢంగా,ఎప్పుడూ ఏవో పాటలు పాడుకుంటూఉండేవారు

మా అవ్వలూ అమ్మమ్మలూ బలమైన వాళ్ళు

మా అవ్వలకీ మామ్మలకీ ఎన్నో జ్ఞాపకం ఉండేవి

కుంకుడుకాయ, ఉల్లిపాయ, తడిమట్టి వాసన వేసేవాళ్ళు

వాళ్ళ చురుకైన చేతులమీద నరాలు ఉబ్బి వంపులుతిరిగేవి

వాళ్లు ఎప్పుడూ ఏదో మంచిమాట చెబుతూనే ఉండేవారు

మా అవ్వలూ అమ్మమ్మలూ బలమైనవాళ్ళు

మరి నేనెందుకు వాళ్లలా లేను?

.

మార్గరెట్ వాకర్

July 7, 1915 – November 30, 1998

అమెరికను కవయిత్రి

.

.

Lineage

My grandmothers were strong.

They followed plows and bent to toil.

They moved through fields sowing seed.

They touched earth and grain grew.

They were full of sturdiness and singing.

My grandmothers were strong.

My grandmothers are full of memories

Smelling of soap and onions and wet clay

With veins rolling roughly over quick hands

They have many clean words to say.

My grandmothers were strong.

Why am I not as they?

.

Margaret Walker

July 7, 1915 – November 30, 1998

American Poet

“పరంపర… మార్గరెట్ వాకర్, అమెరికను కవయిత్రి”‌కి ఒక స్పందన

  1. ఇప్పటి వాళ్ళకంతా నాజూకుతనం ఇష్టం . దాన్నే పెంచి పోషించుకుంటూ జీవితాన్ని దృఢముగా నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నారు . మంచి కవిత. ఆలోచింపజేస్తుంది .

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.