కెసాండ్రా… ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్, అమెరికను కవి

ప్రాచీన గ్రీకు ఇతిహాసం ప్రకారం కెసాండ్రా(అలెగ్జాండ్రా) ప్రయం, హెకూబాల కుమార్తె పేరు.

ఆమె భవిష్యత్తు ఎంత ఖచ్చితంగా చెప్పగలిగినా అవి ప్రజలు నమ్మకుండుదురుగాక అని అపోలో ఆమెను శపించాడని ప్రతీతి.

ఇది చాలా గొప్ప కవిత. దేశభక్తి అంటే జెండాలు ఎగరెయ్యడం, నినాదాలివ్వడం ఒక్కటే కాదు. మనం చేస్తున్న తప్పులు గ్రహించి సరిదిద్దుకుని, జనబాహుళ్యానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లాభించే పనులు చెయ్యాలి. మనబాగు కోసం పదిమందిని చంపుకుంటూ పోతుంటే, మనకి పాలించడానికి మిగిలేవి శ్మశానాలే అన్నసత్యం మరిచిపోకూడదు.
ఈ కవి కొన్ని గొంతు మింగుడుపడని సత్యాలని చెప్పాడు… అమెరికను యుద్ధోన్మాదం గురించి.

అది మనకీ వర్తిస్తుంది. మనకున్న శతాబ్దాల వర్ణ, లింగ, వర్గ వివక్ష వారసత్వంగా సంక్రమిస్తోంది. పదిమందికి మంచిచెయ్యనిది మనకి మంచిచేస్తున్నదయినా నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టలేకపోతే, చరిత్రచూపిస్తున్న సత్యాన్ని చూడడం ఇష్టంలేక మనం కళ్ళు మూసుకున్నట్టు అవుతుంది తప్ప రాబోయే వినాశం మాత్రం తప్పదు.

.

ఎవరో అంటుంటే విన్నాను: “నిజానికి
ఈ పిల్లలకి నేనేమి సలహా ఇవ్వగలను?
మీకు డాలరు తప్ప మరోటి తెలియదు
అదెక్క్డ పడిపోతుందోనని మీ భయం.

“దానికోసం ఎత్తైన పూజామందిరాలు కడతారు
మిమ్మల్నందరూ చూడడానికి, కానీ మీరు గుడ్డివాళ్ళు
దాన్నుండి ఎక్కువసేపు దృష్టిమరల్చ లేరు
మీ ముందూ వెనకా ఏమున్నాయో చూడడానికి.

“మీ విచక్షణ కాసేపు ఆగమని ప్రబోధించినా
ఓ నవ్వు నవ్వి, మీకే ఎక్కువ తెలుసునంటారు;
కాని మీకు తెలిసినదాన్ని గుండెల్లో
లోహపు కడ్డీల్లా భద్రంగా దాచుకుంటారు.

మీరు నవ్వుతూ అంటారు: “మేమింకా కుర్రాళ్ళం,
విడిచిపెట్టి, మా మానాన్న మమ్మల్ని ఎదగనీండి: అని
కాలం మిమ్మల్ని ఎంత భరించాలి, విధి ఇంకా
మీకెంత అనుగ్రహించాలి అన్న దానికి సమాధానం లేకుండా.

“అదృష్టవశాత్తూ కొన్ని సంతోషకరమైన సంవత్సరాలు
కలిసొచ్చాయి; కానీ ఆ గర్వమే మీ పతనానికి దారి తీస్తోంది.
కాలం మీకు ఆ అదృష్టం అలాగే కొనసాగుతుందనీ
మీకు పరీక్షపెట్టకుండా ముద్దు చేస్తుందనీ అనుకుంటున్నారా?

నశించిన ఏ చరిత్ర గ్రహణం,
నిలకడలేని ఏ నక్షత్రాల గుడారాలు
మీకు సహస్రాబ్దాల ముందుచూపునిచ్చి
యుద్ధాలని కొనసాగనిమ్మంటున్నాయి?

ప్రపంచం ఇంతవరకు ఎరుగని
చరిత్రకెక్కని ఏ పదవీ చ్యుతి
ఎక్కడ జరిగిందనుకున్నా, మీకొక్కరికేనా,
అంత తేటతెల్లంగా సంకేతాలిచ్చింది?

“మీ డాలరూ, మీ పావురం, మీ రాబందూ
అవొక మూర్తి త్రయం. వాటిని మీరు
మీకంటే కూడా గొప్పగా ఊహించుకుంటారు
అది లాబిస్తుంది, ఉబ్బిస్తుంది, కొత్తగా ఉంటుంది.

“శక్తి మీది, మీ చూపుది కాదు.
మీరు దేనిమీదనడుస్తున్నారో చూడలేకున్నారు;
మీకు శతాబ్దాల విజ్ఞానం మార్గం చూపిస్తోంది
కానీ దాన్ని అనుసరించే తెలివే మీకు లేకున్నది.

క్రూరమూ, నిర్దాక్షిణ్యమైన పాత సత్యాలనే
ఎప్పటికీ అనుసరించాలని అనుకుంటున్నారా?
ఇప్పుడు ప్రపంచం ఏమిటో అంచనావెయ్యడానికి
కళ్ళు తెరిచి చూడవలసిన అవసరం లేదా?

మీకిప్పుడు ఉన్నదానికి మూల్యంగా
ప్రజలందర్నీ పణం పెట్టాల్సిందేనా?” …
మరొకమాట వినిపించలేదు.. నవ్వుతున్న జనంతో పాటే
మేమూ నడిచాం. ఎవరూ వినలేదు, పట్టించుకోలేదు.
.
ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్

December 22, 1869––April 6, 1935

అమెరికను కవి

.

.

Cassandra

 .

I heard one who said: “Verily,

  What word have I for children here?

Your Dollar is your only Word,

  The wrath of it your only fear.

“You build it altars tall enough

  To make you see, but you are blind;

You cannot leave it long enough

  To look before you or behind.

“When Reason beckons you to pause,

  You laugh and say that you know best;

But what it is you know, you keep

  As dark as ingots in a chest.

You laugh and answer, ‘We are young;

  Oh, leave us now, and let us grow:’

Not asking how much more of this

  Will Time endure or Fate bestow.

“Because a few complacent years

  Have made your peril of your pride,

Think you that you are to go on

  Forever pampered and untried?

“What lost eclipse of history,

  What bivouac of the marching stars,

Has given the sign for you to see

  Millenniums and last great wars?

“What unrecorded overthrow

  Of all the world has ever known,

Or ever been, has made itself

  So plain to you, and you alone?

“Your Dollar, Dove and Eagle make

  A Trinity that even you

Rate higher than you rate yourselves;

  It pays, it flatters, and it’s new.

“And though your very flesh and blood

  Be what your Eagle eats and drinks,

You’ll praise him for the best of birds,

  Not knowing what the Eagle thinks.

“The power is yours, but not the sight;

  You see not upon what you tread;

You have the ages for your guide,

  But not the wisdom to be led.

“Think you to tread forever down

  The merciless old verities?

And are you never to have eyes

  To see the world for what it is?

“Are you to pay for what you have

  With all you are?”—No other word

We caught, but with a laughing crowd

  Moved on. None heeded, and few heard.

.

Edwin Arlington Robinson

December 22, 1869––April 6, 1935

American Poet who won 3 Pulitzer Prizes.

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/307.html

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.