పైబడుతున్న వయసు… జార్జి క్రేబ్, ఇంగ్లీషు కవి

ఆరేళ్ళు గడిచిపోయాయి, ఆరుకు ముందు ఇపుడు నలభై,
కాలం అలవాటుగా తన మాయలు పన్నడం ప్రారంభించింది:
ఒకప్పుడు యువతుల కనులకు సొగసుగా కనిపించిన
గోధుమ రంగు ఉంగరాలజుత్తు,రానున్న తెలుపు పొడచూపుతోంది;
ఒకప్పుడు వెచ్చగా ఉండే నెత్తురు ఇప్పుడు చల్లబడడం ప్రారంభించింది
దానితో పాటే, మనిషిని వశం చేసుకునే కాలం శక్తీ పెరగసాగింది.
ఒకప్పుడు నడవడమో, స్వారీ చెయ్యడమో అలవాటు,
ఇపుడు సవారీ చెయ్యాలన్న కోరిక కలగడం లేదు;
ఒక మోస్తరు తొందరగా నడిచినా ఒళ్ళు వేడెక్కిపోతుంది,
కాస్తంత దూరానికే కాళ్ళు పీకెస్తుంటాయి.
మా చుట్టానికి దూరంనుండి అద్భుతమైన కొండలు చూపించేను
కానీ,”మరీ అంత అందంగా ఉండవులే, ఎక్కక్కరలేదు,” అన్నాను.
మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాలంటే భయం:
అక్కడి పానీయాలూ చల్లన, సుఖకరమైన శయ్య మెత్తన;
ఇంటిదగ్గర నా అభిరుచికి తగ్గట్టుగా ఉంటాయి
అన్నీ నాకు నచ్చిన రీతిలో అమర్చి ఉంటాయి.
ఇపుడు వేట మానేశాను; నా గుర్రాలు నాకు నచ్చడం లేదు…
రాత్రి భోజనం బాగుంటోంది; చదరంగం బాగా ఆడడం నేర్చుకున్నాను.
నేను నా వేటకుక్కనీ, తుపాకినీ తీసుకెళ్ళేను,
కానీ నేను పేల్చనందుకు వేటకుక్క చాలా అసంతృప్తి చెందింది.
నేను అపుడప్పుడు ఉదయం నడక తప్పిపోతే విచారించడం లేదు
నేను పరిగెత్తలేక దొరికిపోయిన వాన బాగుందనిపిస్తోంది.
నిజానికి, మెల్లిగా బద్ధకం ఆవహిస్తున్నట్టు తెలుస్తోంది;
చురుకైన చెయ్యీ, లాఘవమైన భుజమూ కనుమరుగయ్యాయి;
రోజూ చేసే చిన్న చిన్న పనులు అలవాట్లుగా మారిపోయేయి
కొత్త వస్తువులన్నా, సంప్రదాయాలన్నా అయిష్టత ప్రబలుతోంది.
నా చెట్లని విక్రయించడానికి ఇష్టపడుతున్నాను
పళ్ళచెట్లు ఎన్నున్నాయో లెక్కపేట్టడం ప్రారంభించేను
కొమ్మలెలా వస్తున్నాయో పఋఇశీలించడం ప్రారంభించేను
తరచు, చెప్పిన కథే చెపుతూ— ఒక్క మాటలో, రసహీనమవజొచ్చాను.
.
జార్జి క్రేబ్
(24 December 1754 – 3 February 1832)
ఇంగ్లీషు కవి

.

.

The Approach of Age

.

Six years had passed, and forty ere the six,        

When Time began to play his usual tricks:

The locks once comely in a virgin’s sight, 

Locks of pure brown, displayed the encroaching white;         

The blood, once fervid, now to cool began,         

And Time’s strong pressure to subdue the man. 

I rode or walked as I was wont before,      

But now the bounding spirit was no more;

A moderate pace would now my body heat,       

A walk of moderate length distress my feet.       

I showed my stranger guest those hills sublime, 

But said, “The view is poor, we need not climb.”

At a friend’s mansion I began to dread     

The cold neat parlor and the gay glazed bed;      

At home I felt a more decided taste, 

And must have all things in my order placed.     

I ceased to hunt; my horses pleased me less,—   

My dinner more; I learned to play at chess.        

I took my dog and gun, but saw the brute 

Was disappointed that I did not shoot.     

My morning walks I now could bear to lose,      

And blessed the shower that gave me not to choose.    

In fact, I felt a languor stealing on;   

The active arm, the agile hand, were gone;

Small daily actions into habits grew,

And new dislike to forms and fashions new.       

I loved my trees in order to dispose;

I numbered peaches, looked how stocks arose;   

Told the same story oft,—in short, began to prose.

.

(From “Tales of the Hall”)

George Crabbe

(24 December 1754 – 3 February 1832)

English Poet

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds: Bliss Carman, et al. 

Volume III. Sorrow and Consolation.  1904.

III. Adversity

http://www.bartleby.com/360/3/98.html

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.