విశ్వజనీన ప్రార్థన… అలెగ్జాండర్ పోప్, ఇంగ్లీషు కవి

సమస్త సృష్టికీ ఆద్యుడవైన ఓ తండ్రీ!
ప్రతి యుగంలో, ప్రతి దేశంళో
యోగులూ, పశుప్రాయులూ,వివేకులు
కొలిచే యెహోవా, ప్రభూ, పరమాత్మా!

నువ్వే ప్రథమ కారణానివి, అనవగతమవు,
నా ఇంద్రియాలన్నిటినీ స్వాధీనపరుచుకుని
ఇదొక్కటి తెలియజేస్తావు, నువ్వు సత్యమని
నామట్టుకు నేను నిను చూడలేని అంధుణ్ణి.

కానీ, ఈ విశాల నిశా సామ్రాజ్యంలో
చెడులో మంచి చూడగల శక్తి నిచ్చేవు.
ప్రకృతిని విధికి బానిసను చేసి
కాస్తంత వెసులు ఇచ్చావు తోచింది చెయ్యడానికి.

నా మనసు ఏది చెయ్యమని చెబుతుందో
లేక వద్దని వారిస్తుందో,
దీన్ని నరకంకంటే భయంగా త్రోసిపుచ్చేలా
దాన్ని స్వర్గంకంటే ప్రియంగా అనుసరించేలా అనుగ్రహించు.

నీవు దయతో ప్రసాదించిన వరాలను
నేను పోగొట్టుకోకుండా చూడు;
మనిషి తీసుకుంటేనే దేమునికి సంతృప్తి
వాటిని అనుభవించడమే, విధేయత.

అయినప్పటికీ, నీ కరుణ
ఈ భూతలానికే పరిమితమని నను పొరబడనీకు,
ఇన్ని విశ్వాలు వ్యాపించి ఉండగా
నిన్ను ఒక మానవుడికే దేవునిగా భ్రమించనీకు.

ఈ బలహీనమైన, తెలివితక్కువ చేయి
నీకు మారుగా అస్త్రాలను ప్రయోగించి
నీకు శత్రువని నేను నిర్ణయించిన ప్రతివారికీ
నేల నలుచెరగులా శిక్షలు విధించేలా చెయ్యనీకు.

నా మార్గము సరియైన దయితే, నీ కరుణ
నేను ఆ మార్గంలో కొనసాగేలా చూడనీ;
నేను తప్పు చేస్తే, ప్రభూ, నా మనసుకి
మంచి మార్గం వెతుక్కునేలా ఉపదేశించు!

మూర్ఖపు అహంకారమూ, పాపిష్టి అసంతృప్తీ
నన్ను ఈ రెంటినుండీ ఒకే రీతిగా కాపాడు:
నీ విజ్ఞత నాకు ఏది తిరస్కరించినా,
నీ కరుణ నాకు ఏది అనుగ్రహించినా

ఇతరుల కష్టాన్ని తెలుసుకునేలా బోధించు
నే కనుగొన్న లోపాలు దాచగలిగేలా చెయ్యి;
నేను ఇతరులపై ఏ మేరకు కరుణ ప్రదర్శిస్తానో
ఆ మేరకు నాకు నువ్వు నీ కరుణ ప్రసాదించు.

నేను నీచుణ్ణే గాని మరీ అంత కాదు;
నీ పేరు జపించిన కారణం చేత;
ప్రభూ, నేను ఎక్కడకి వెళ్ళినా త్రోవ చూపించు
అది ఈ రోజు జీవితమైనా, మృత్యువైనప్పటికీ.

ఈ రోజుకింత రొట్టె దొరికి, ప్రశాంతత చిక్కనీ,
సృష్టిలో ఈ విశాల గగనం క్రింద సమస్తానికీ
ఏది దొరికిందో ఏది దొరకలేదో అన్నీ నేకెరుకే,
నీ చిత్తం ఎలా ఉంటే అలా జరగనీ.

ఈ రోదసే దేవాలయమైన నీకి,
ఈ నేలా, సముద్రాలూ, ఆకాశమూ పూజాస్థలమైన నీకు
అన్ని ఆత్మలూ ముక్త కంఠంతో కీర్తించుగాక!
ప్రకృతి అంతా నీకు సుగంధాలు అర్చించుగాక!
.

అలెగ్జాండర్ పోప్

 21 May 1688 – 30 May 1744

ఇంగ్లీషు కవి

 

.

The Universal Prayer

Father of all! in every age,

  In every clime adored,

By saint, by savage, and by sage,

  Jehovah, Jove, or Lord!

Thou great First Cause, least understood,

  Who all my sense confined

To know but this, that thou art good,

  And that myself am blind;

Yet gave me, in this dark estate,

  To see the good from ill;

And, binding nature fast in fate,

  Left free the human will:

What conscience dictates to be done,

  Or warns me not to do,

This, teach me more than hell to shun,

  That, more than heaven pursue.

What blessings thy free bounty gives

  Let me not cast away;

For God is paid when man receives,

  To enjoy is to obey.

Yet not to earth’s contracted span

  Thy goodness let me bound,

Or think thee Lord alone of man,

  When thousand worlds are round:

Let not this weak, unknowing hand

  Presume thy bolts to throw,

And deal damnation round the land

  On each I judge thy foe.

If I am right thy grace impart

  Still in the right to stay;

If I am wrong, O, teach my heart

  To find that better way!

Save me alike from foolish pride

  And impious discontent

At aught thy wisdom has denied,

  Or aught thy goodness lent.

Teach me to feel another’s woe,

  To hide the fault I see;

That mercy I to others show,

  That mercy show to me.

Mean though I am, not wholly so,

  Since quickened by thy breath;

O, lead me wheresoe’er I go,

  Through this day’s life or death!

This day be bread and peace my lot;

  All else beneath the sun,

Thou knowest if best bestowed or not,

  And let thy will be done.

To thee, whose temple is all space,

  Whose altar, earth, sea, skies,

One chorus let all Being raise,

  All Nature incense rise!

.

Alexander Pope

(1688–1744)

English Poet

The World’s Best Poetry.

Eds. Bliss Carman, et al.

Volume IV. The Higher Life.  1904.

  1. The Divine Element—(God, Christ, the Holy Spirit)

http://www.bartleby.com/360/4/7.html

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.