నాతో నేను … పాల్ ఫ్లెమింగ్, జర్మను కవి

ఓ మనసా!
నిన్నేదీ విచారపడేలా, చిరచిరలాడేలా
లేక పశ్చాత్తాపపడేలా చెయ్యకుండుగాక;
నువ్వు నిశ్చింతగా ఉండు;
దైవము ఏది ఆజ్ఞాపిస్తే అది సత్యము
దాన్ని కనుక్కోవడంలోనే నీ ఆనందము.

ఓ హృదయమా!
రేపటి గురించిన చింతతో
ఈ రోజంతా ఎందుకు విచారిస్తావు?
పైనుండి అందర్నీ ఒకరు గమనిస్తున్నారు. నిజం.
నీ భాగం
నీకు అందే విషయమై ఎంతమాత్రం సందేహించకు.

ధృఢంగా ఉండు; చంచలత్వం వద్దు;
ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకు
నిద్రకు తప్ప;
నీకు తెలిసుండాలి భగవత్సంకల్పం
అన్ని జీవరాసులకీ, వాటితోపాటే నీకూ
ఎప్పుడూ ఉత్తమమైనదే.
.

పాల్ ఫ్లెమింగ్

(October 5, 1609 – April 2, 1640)

జర్మను కవి, వైద్యుడు

 

.

To Myself

.

Let nothing make thee sad or fretful,

      Or too regretful;

            Be still;

What God hath ordered must be right;

Then find in it thine own delight,

            My will.

Why shouldst thou fill to-day with sorrow

      About to-morrow,

            My heart?

One watches all with care most true;

Doubt not that he will give thee too

            Thy part.

Only be steadfast; never waver,

      Nor seek earth’s favor,

            But rest:

Thou knowest what God wills must be

For all his creatures, so for thee,

            The best.

.

(Tr. From the German by Catherine Winkworth)

Paul Fleming

German Physician and Poet

(October 5, 1609 – April 2, 1640)

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds. Bliss Carman, et al.

Volume III. Sorrow and Consolation.  1904.

  1. Comfort and Cheer

http://www.bartleby.com/360/3/125.html